మద్యం ప్రియులకు భారీ షాక్.. లిక్కర్‌పై 50 శాతం ఎక్సైజ్ డ్యూటీ..

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక రంగాలు మూతపడ్డాయి. అయితే లాక్‌డౌన్ 3.0 లో కేంద్ర ప్రభుత్వం కొన్నింటికి వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలో అప్పటి వరకు మూతపడ్డ మద్యం షాపులను తెరుచుకునేందుకు షరతులతో కూడిన అనుమతులను ఇచ్చింది. దీంతో పలు రాష్ట్రాలు లిక్కర్ షాపుల ఓపెనింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే అదనుగా మద్యం ధరలను అమాంతం పెంచేశాయి. తాజాగా జమ్ముకశ్మీర్ కూడా ఇదే […]

మద్యం ప్రియులకు భారీ షాక్.. లిక్కర్‌పై 50 శాతం ఎక్సైజ్ డ్యూటీ..
Follow us

| Edited By:

Updated on: May 17, 2020 | 4:58 PM

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక రంగాలు మూతపడ్డాయి. అయితే లాక్‌డౌన్ 3.0 లో కేంద్ర ప్రభుత్వం కొన్నింటికి వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలో అప్పటి వరకు మూతపడ్డ మద్యం షాపులను తెరుచుకునేందుకు షరతులతో కూడిన అనుమతులను ఇచ్చింది. దీంతో పలు రాష్ట్రాలు లిక్కర్ షాపుల ఓపెనింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే అదనుగా మద్యం ధరలను అమాంతం పెంచేశాయి. తాజాగా జమ్ముకశ్మీర్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. మద్యంపై 50 శాతం ఎక్సైజ్ డ్యూటీని విధిస్తోంది. విస్కీ, బీర్, వైన్ సహా అన్ని రకాల లిక్కర్ సేల్స్‌పై ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.కాగా, కరోనా నేపథ్యంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోతోంది. ఆదాయం కూడా లేకపోవడంతో.. ప్రభుత్వం ఆదాయాం పెంచుకునేందుకు లిక్కర్ సేల్స్‌పై టాక్స్‌లను విధిస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు ఏపీలో జగన్ సర్కార్ 75శాతం ధరలను పెంచగా.. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం 70 శాతం ధరలను పెంచేశాయి. అయితే ప్రభుత్వాలు ధరలను ఎంత పెంచినా కూడా.. మద్యం ప్రియులు మాత్రం కొనేందుకు వెనుకడుగు వేయడం లేదు. లిక్కర్ షాపుల ముందు క్యూలైన్లు కడుతున్నారు.