కోవిడ్ 19 వ్యాక్సిన్ స్టోరేజీ, పంపిణీకి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సిధ్ధం, త్వరలో మాస్ వ్యాక్సినేషన్

తమ కోవీ షీల్డ్ వ్యాక్సిన్ ని అత్యవసర వినియోగానికి అనుమతించాలంటూ పూణే లోని సీరం కంపెనీ ప్రభుత్వాన్ని కోరడంతో జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత అధికారులు దీన్ని స్టోర్ చేయడానికి, పంపిణీకి సమాయత్తమయ్యారు..

కోవిడ్ 19 వ్యాక్సిన్ స్టోరేజీ, పంపిణీకి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సిధ్ధం, త్వరలో మాస్ వ్యాక్సినేషన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 07, 2020 | 7:59 PM

తమ కోవీ షీల్డ్ వ్యాక్సిన్ ని అత్యవసర వినియోగానికి అనుమతించాలంటూ పూణే లోని సీరం కంపెనీ ప్రభుత్వాన్ని కోరడంతో జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత అధికారులు దీన్ని స్టోర్ చేయడానికి, పంపిణీకి సమాయత్తమయ్యారు. దశలవారీగా జమ్మూ కాశ్మీర్ ప్రజలందరికీ ఈ టీకా మందు ఇస్తామని ఆరోగ్య, వైద్య విద్యా శాఖ ఫైనాన్షియల్ సెక్రటరీ అటల్ డుల్లో తెలిపారు. మొదట భద్రంగా దీన్ని స్టోర్ చేయాల్సి ఉందన్నారు. తొలి దశలో హెల్త్ వర్కర్లకు, అనంతరం ఫ్రంట్ లైన్ సిబ్బందికి, పోలీసులకు, సీనియర్ సిటిజన్లకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందన్నారు. జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎంతమంది డాక్టర్లు, నర్సులు, ఇతర స్టాఫ్ ఉన్నారో వారి డేటాను జమ్మూ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి సమర్పించినట్టు ఆయన చెప్పారు.

భారీ ఎత్తున మాస్ వ్యాక్సినేషన్ కోసం జమ్మూ కాశ్మీర్ చీఫ్ సెక్రటరీ బీవీఆర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఇటీవల వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలు జరిగాయి.  త్వరలో యుధ్ధ ప్రాతిపదికన ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.