‘ఆయనకు జైలు శిక్షే సరైనది, నితీష్ కుమార్ పై చిరాగ్ పాశ్వాన్ ఫైర్

బీహార్ సీఎం నితీష్ కుమార్ కి జైలే సరైనచోటు అని లోక్ జన శక్తి నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు. నితీష్ కి స్కాములతో ప్రమేయం లేకపోతే జైలు ఎందుకన్నారు. తన అయిదేళ్ల పాలనలో అవినీతికి పాల్పడినవారికి జైలు శిక్ష విధిస్తామని నితీష్ కుమార్..

  • Umakanth Rao
  • Publish Date - 12:50 pm, Mon, 26 October 20

బీహార్ సీఎం నితీష్ కుమార్ కి జైలే సరైనచోటు అని లోక్ జన శక్తి నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు. నితీష్ కి స్కాములతో ప్రమేయం లేకపోతే జైలు ఎందుకన్నారు. తన అయిదేళ్ల పాలనలో అవినీతికి పాల్పడినవారికి జైలు శిక్ష విధిస్తామని నితీష్ కుమార్ ఇచ్చిన హామీని చిరాగ్ ప్రస్తావించారు. నేను అవినీతికి పాల్పడినా జైలుకు వెళ్తా అని నితీష్ లోగడ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నితీష్ కుమార్ కి తన అయిదేళ్ల పాలనలో జరిగిన భారీ కుంభకోణాలు, అవినీతి గురించి  తెలియదా అని చిరాగ్ పాశ్వాన్ ప్రశ్నించారు.  ఆయనకు కూడా వీటితో సంబంధం ఉందని, ఇన్వెస్టిగేషన్ జరగాలని అన్నారు. అవినీతి మచ్ఛ పడిన ఎవరినీ స్వేచ్చగా బయట తిరగరానివ్వరాదు అన్నారాయన. నితీష్ ప్రభుత్వం పాటిస్తున్న మద్య నిషేధం అవినీతికి మూలమని, లిక్కర్ బ్యాన్ పై దర్యాప్తు ఎందుకు జరగడంలేదని చిరాగ్ అన్నారు.  బీహార్ లో లిక్కర్ మాఫియా గురించి ఆయన పేర్కొన్నారు.