ఇక గ్యాస్‌ బుకింగ్‌ కు దేశమంతటా ఇదే నెంబర్‌

నవంబర్‌ 1నుండి దేశమంతటా ఒకే నంబర్‌ ద్వారా ఎల్‌పిజి బుకింగ్‌ అవకాశం కల్పిస్తోంది ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఒసి). వినియోగదారులు వచ్చేనెల 1వ తేది నుండి 7718955555 నెంబర్‌ ద్వారా మాత్రమే గ్యాస్ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన అన్ని ఫోన్‌ నంబర్లను అక్టోబర్‌ 31 నుండి నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ నంబర్‌ 24 గంటలు పనిచేస్తుందని.. వినియోగదారులు రిజిస్టర్డ్‌ ఫోన్‌ నెంబర్ల నుండే బుకింగ్‌ చేసుకోవాల్సిఉంటుందని పేర్కొంది. ఈ సేవలు ఉపయోగించుకునేందుకు గ్యాస్ వినియోగదారు తమ […]

  • Venkata Narayana
  • Publish Date - 9:45 pm, Fri, 30 October 20

నవంబర్‌ 1నుండి దేశమంతటా ఒకే నంబర్‌ ద్వారా ఎల్‌పిజి బుకింగ్‌ అవకాశం కల్పిస్తోంది ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఒసి). వినియోగదారులు వచ్చేనెల 1వ తేది నుండి 7718955555 నెంబర్‌ ద్వారా మాత్రమే గ్యాస్ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన అన్ని ఫోన్‌ నంబర్లను అక్టోబర్‌ 31 నుండి నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ నంబర్‌ 24 గంటలు పనిచేస్తుందని.. వినియోగదారులు రిజిస్టర్డ్‌ ఫోన్‌ నెంబర్ల నుండే బుకింగ్‌ చేసుకోవాల్సిఉంటుందని పేర్కొంది. ఈ సేవలు ఉపయోగించుకునేందుకు గ్యాస్ వినియోగదారు తమ కన్య్జూమర్‌ నెంబర్‌ను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. విజయవాడలోని ఐఒసి కార్యాలయంలో ఇవాళ (శుక్రవారం) జరిగిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ సేల్స్‌ ప్యూటీ మేనేజర్‌ ఫుల్‌జెలె ఈ మేరకు స్పష్టం చేశారు.