సూపర్ స్టార్ సరసన సాహో బ్యూటీ.? మహేష్- రాజమౌళి సినిమాపై వైరల్ వార్త.!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్యాన్ ఇండియా స్టార్‌గా మారబోతున్నారు. దాని కోసం దర్శకధీరుడు రాజమౌళి అద్భుతమైన స్క్రిప్ట్‌ను రెడీ చేశారు.

  • Ravi Kiran
  • Publish Date - 9:00 pm, Fri, 13 November 20

Rajamouli And Mahesh Babu Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్యాన్ ఇండియా స్టార్‌గా మారబోతున్నారు. దాని కోసం దర్శకధీరుడు రాజమౌళి అద్భుతమైన స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమాకు కెఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారీ పాట షూటింగ్‌లోనూ.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా పనుల్లోనూ నిమగ్నమైన సంగతి తెలిసిందే.

అయితే ఈలోపు మహేష్-రాజమౌళి మూవీ క్యాస్టింగ్ కన్ఫర్మ్ అయినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లాక్ డౌన్ టైంలో రాజమౌళి మహేష్ మూవీ కోసం కథను ఓకే చేశారని, సూపర్ స్టార్ తన డ్రీం రోల్ అయిన జేమ్స్ బాండ్‌గా కనిపించబోతున్నారని టాక్‌. మహేష్‌కి జోడీగా సాహో ఫేమ్ శ్రద్ద కపూర్ నటిస్తారని సమాచారం.

నెక్స్ట్ ఇయర్ మహేష్ పుట్టినరోజు కానుకగా ఈ మూవీ అనౌన్స్ అవుతుందన్నది మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. కానీ.. ఇవన్నీ పైపై వార్తలే. ఇప్పటికైతే విజయేంద్ర ప్రసాద్ కథ.. కీరవాణి మ్యూజిక్.. ఇంతవరకే ఫిక్స్ అయ్యాయి. ఇంతకంటే ఈ ప్రాజెక్టు ముందుకు జరగలేదన్నది మరో వెర్షన్‌. ఒకవేళ.. జక్కన్న… టెంటేటివ్‌గా హీరోయిన్లతో ఒక లిస్ట్ తయారు చేసినా.. సినిమా మొదలయ్యేసరికి శ్రద్ధా రేంజ్ ఎలా ఉంటుందో చెప్పలేం కనుక.. మహేష్‌కి సాహో బ్యూటీతో రొమాన్స్ కష్టమే కావొచ్చు.

Also Read:

మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగటివ్.. కాలం, కరోనా నన్ను కన్ఫ్యూజ్ చేశాయంటూ ట్వీట్..

పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పరీక్షలపై కీలక నిర్ణయం.!

రైలు ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. 12 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే..!

ఏపీ: సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ గడువు పొడిగింపు..

కూతురు పుట్టింది.. అదృష్టాన్ని తెచ్చింది.. మురిసిపోతున్న యువ పేసర్ నటరాజన్..