టిబెట్-చైనా మధ్య భారత్.. 70 ఏళ్ళ వివాదం.. మోదీ పైనే ‘పరిష్కార భారం’

భారత్-చైనా మధ్య టిబెట్ వివాదం సుమారు 70 ఏళ్లుగా నడుస్తోంది. 1950 అక్టోబరులో టిబెట్ ను ఇండియా ఆక్రమించుకుందని చైనా ఆరోపించడం, దాంతో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ బ్రిటిష్ ప్రభుత్వ సలహాపై టిబెట్ అంశంపై..

టిబెట్-చైనా మధ్య భారత్.. 70 ఏళ్ళ వివాదం.. మోదీ పైనే  'పరిష్కార భారం'
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 13, 2020 | 3:04 PM

భారత్-చైనా మధ్య టిబెట్ వివాదం సుమారు 70 ఏళ్లుగా నడుస్తోంది. 1950 అక్టోబరులో టిబెట్ ను ఇండియా ఆక్రమించుకుందని చైనా ఆరోపించడం, దాంతో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ బ్రిటిష్ ప్రభుత్వ సలహాపై టిబెట్ అంశంపై దాదాపు చేతులు ఎత్తేయడం తెలిసిందే. సైనిక సాయం లేకుండా టిబెట్ కి ఎలాంటి ప్రయోజనం కలిగించాలన్న నిర్ణయం తీసుకోవలసింది ఇండియానేనని, టిబెట్ స్వతంత్రతకు గుర్తింపు అన్న ప్రసక్తే ఉండరాదని బ్రిటిషర్లు సూచించడంతో.. టిబెట్ మీద  ఆధిపత్యాన్ని నెహ్రూ  పరోక్షంగా చైనా మీదే వదిలేశారు. దాంతో ఆ ప్రాంతంపై తమదే పెత్తనమని చైనా విర్రవీగుతూ వచ్చింది. కానీ టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా అప్పటినుంచి ఆ దేశ ఎత్తుగడలను అహింసాయుతంగా ఎదుర్కొంటూనే వచ్చారు. గాంధేయ మార్గంలో శాంతియుత ప్రతిఘటనతో నిరసనలు తెలుపుతూ వచ్చారు.  కానీ చైనా… టిబెట్ జలవనరుల మీద కన్నేస్తూ.. అక్కడ డ్యామ్ లు నిర్మిస్తోంది. టిబెట్ మీద పట్టు సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.

అయితే తాజాగా  లడఖ్ నియంత్రణ రేఖ వద్ద చైనా తన దళాలను మోహరించడం, భారత-చైనా దేశాల మధ్య సైనిక స్థాయిలో చర్చలు జరగడానికి మోదీ ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో.. కొంతవరకు అక్కడ పరిస్థితి చల్లబడింది. ప్రస్తుతానికి చైనా  టిబెట్ అంశాన్ని పక్కన బెట్టినట్టు కనిపిస్తోంది. పైగా ఉభయ దేశాల మధ్య దౌత్య స్థాయిలో కూడా సంప్రదింపులకు ప్రభుత్వం పూనుకోవడంతో.. ఈ వ్యవహారం కొంత సద్దు మణిగింది.

Latest Articles