ఇది చేవలేని ప్రభుత్వం.. రాహుల్ గాంధీ ఫైర్

ప్రభుత్వ పిరికి చర్యలకు గాను ఇండియా భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. లడాఖ్ లో గత నెలలో భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ పైన,  ఈ ఉభయ దేశాల బోర్డర్ అంశంపైన ప్రధాని మోదీ..

ఇది చేవలేని ప్రభుత్వం.. రాహుల్ గాంధీ ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 18, 2020 | 8:08 PM

ప్రభుత్వ పిరికి చర్యలకు గాను ఇండియా భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. లడాఖ్ లో గత నెలలో భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ పైన,  ఈ ఉభయ దేశాల బోర్డర్ అంశంపైన ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటాన పెడుతున్న రాహుల్.. మరో ట్వీట్ చేశారు. ఈ ప్రభుత్వం…. నాటి బ్రిటిష్ మాజీ ప్రధాని నెవెల్లీ ఛాంబర్లీన్…రెండో ప్రపంచ యుధ్ధానికి ముందు నాజీ జర్మనీలను బుజ్జగించేందుకు చేసిన విఫల యత్నం మాదిరే అలాంటి పరిస్థితినే ఎదుర్కొవలసి వస్తుందని ఆయన అన్నారు. నిన్న లడాఖ్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైనికులతో మాట్లాడుతున్న షార్ట్ వీడియోను కూడా ఆయన తన ట్వీట్ కి జత చేశారు. ఉద్రిక్తతల పరిష్కారానికి ఉభయ దేశాల  మధ్య జరుగుతున్న చర్చలకు గ్యారంటీ ఇవ్వలేమని రాజ్ నాథ్..పేర్కొన్నారని, అయితే అదే సమయంలో.. ఈ ప్రపంచంలో మన భూభాగంలోని అంగుళం భూమిని కూడా ఎవరూ కైవసం చేసుకోజాలరని వ్యాఖ్యానించారని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ ఆ మధ్య ఈ ప్రాంతాన్ని విజిట్ చేసినప్పుడు ఆయన కూడా ఇలాగే మాట్లాడారని గుర్తు చేశారు.