ఆఫ్ఘన్‌పై ఆసీస్ అలవోక విజయం

డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ప్రపంచకప్‌లో శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై జయభేరి మోగించింది. డేవిడ్‌వార్నర్ 89, ఆరోన్‌ఫించ్ 66 పరుగులు చేసి అర్ధశతకాలతో చెలరేగిపోయారు. దీంతో ఆఫ్ఘన్ నిర్ధేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని.. ఆసీస్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 34.5 ఓవర్లలోనే చేధించింది. డేవిడ్‌వార్నర్, ఆరోన్‌ఫించ్ ఇద్దరూ.. తొలి వికెట్‌కు 96 పరుగుల శుభారంభాన్ని అందించారు. 205 పరుగుల దగ్గర స్మిత్ ఔటయ్యాక.. మాక్స్‌వెల్ వచ్చి బౌండరీతో ఆసీస్‌కు విజయాన్నందించాడు. కాగా ఆఫ్ఘన్ బౌలర్లలో […]

ఆఫ్ఘన్‌పై ఆసీస్ అలవోక విజయం
Follow us

| Edited By:

Updated on: Jun 02, 2019 | 8:57 AM

డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ప్రపంచకప్‌లో శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై జయభేరి మోగించింది. డేవిడ్‌వార్నర్ 89, ఆరోన్‌ఫించ్ 66 పరుగులు చేసి అర్ధశతకాలతో చెలరేగిపోయారు. దీంతో ఆఫ్ఘన్ నిర్ధేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని.. ఆసీస్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 34.5 ఓవర్లలోనే చేధించింది. డేవిడ్‌వార్నర్, ఆరోన్‌ఫించ్ ఇద్దరూ.. తొలి వికెట్‌కు 96 పరుగుల శుభారంభాన్ని అందించారు. 205 పరుగుల దగ్గర స్మిత్ ఔటయ్యాక.. మాక్స్‌వెల్ వచ్చి బౌండరీతో ఆసీస్‌కు విజయాన్నందించాడు. కాగా ఆఫ్ఘన్ బౌలర్లలో మజీబ్ ఉర్ రహ్మాన్, గుల్బాడిన్‌నైబ్, రషీద్ ఖాన్‌తలో వికెట్ తీశారు.

అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ 207 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయింది. రహ్మత్ షా 43, హష్మతుల్లా 18 పరుగులతో నిలకడగా ఆడి స్కొరుబోర్డుని ముందుకు తీసుకెళ్లారు. ఆతర్వాత కెప్టెన్ గుల్బాడిన్ నైబ్, నజీబుల్లా జద్రాన్ ధాటిగా ఆడి స్కోర్ బోర్డును 150 పరుగులు దాటించారు. అనంతరం రషీద్ ఖాన్, ముజీబ్ రహ్మన్ భాగస్వామ్యతో స్కొర్‌ను 200 ధాటించారు.