వాళ్లను చూస్తే గర్వంగా ఉంది: కోహ్లీ

విశాఖ: భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు తొలి మ్యాచ్‌లో కోహ్లీ సేనను ఓడించింది. రెండు టీ20 మ్యాచ్‌లలో భాగంగా విశాఖ తీరాన జరిగిన తొలి మ్యాచ్‌ను భారత జట్టు చివరి బంతికి కోల్పోయింది. చివరి రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా ఒక ఫోర్, ఒక టూడీ తీసి మ్యాచ్‌ను ఆసిస్ ఆటగాళ్లు ఎగరేసుకుపోయారు. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తన జట్టు బౌలర్లను చూస్తే చాలా గర్వంగా […]

వాళ్లను చూస్తే గర్వంగా ఉంది: కోహ్లీ
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 4:42 PM

విశాఖ: భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు తొలి మ్యాచ్‌లో కోహ్లీ సేనను ఓడించింది. రెండు టీ20 మ్యాచ్‌లలో భాగంగా విశాఖ తీరాన జరిగిన తొలి మ్యాచ్‌ను భారత జట్టు చివరి బంతికి కోల్పోయింది. చివరి రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా ఒక ఫోర్, ఒక టూడీ తీసి మ్యాచ్‌ను ఆసిస్ ఆటగాళ్లు ఎగరేసుకుపోయారు.

అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తన జట్టు బౌలర్లను చూస్తే చాలా గర్వంగా ఉందని చెప్పాడు. ముఖ్యంగా బూమ్రా అయితే మ్యాజిక్ చేశాడని కొనియాడాడు. నాగులు ఓవర్లు వేసిన బూమ్రా 3 కీలక వికెట్లు పడగొట్టాడు. తక్కువ స్కోర్ చేసిన మ్యాచ్‌లలో సహజంగానే నెగ్గడం చాలా కష్టంగా ఉంటుందని, అలాంటిది తాము చివరి బంతి వరకూ మ్యాచ్‌ను తీసుకురాగలిగామంటే అది బౌలర్ల సామర్ధ్యమేనని కోహ్లీ అన్నాడు.

అయితే బ్యాటింగ్‌లో లోపం కారణంగా తాము ప్రధానంగా ఓటమి చెందామని కూడా కోహ్లీ అన్నాడు. ఒక 150 పరుగులు గనక చేసి ఉంటే పరిస్థితి బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. అనంతర ఆసిస్ జట్టు కూడా 20 ఓవర్ల వరకూ ఆడి 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. ఇకపోతే రెండో టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 27న బెంగళూరులో జరగనుంది.