ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కొరడా

Hyderabad hospitals with no fire safety measures to be sealed

రాష్ట్రంలో భద్రతా ప్రమాణాలు పాటించని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులపై కొరడా ఝళిపించనుంది..!ముఖ్యంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి ప్రమాణాలు పాటించని ఆస్పత్రుల లైసెన్స్ రద్దు చేసే యోచనలో ఉన్నారు అధికారులు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించి కనీస ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు..అటు గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు కూడా ఈ ఆగస్టు నెలాఖరు వరకు డెడ్ లైన్ విధించారు. సుమారు 15 మీటర్ల ఎత్తు వరకు గల అన్ని ఆస్పత్రుల్లోనూ తప్పనిసరిగా ఫైర్ సెఫ్టికి  సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో పూర్తి నివేదిక అందజేయాలని సూచించారు. జీహెచ్ఎంసీలో విజిలెన్స్ విభాగంలో డైరెక్టర్ కె. విశ్వజిత్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవల గాంధీ ఆస్పత్రిలోనే పిల్లల వార్డులో షార్ట్ సర్క్యూట్  కారణంగా అగ్రిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే..ఆ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఈ తాజా ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *