Viral News: ఏ అమ్మాయితోనూ సెక్స్ చేయలేదు.. కానీ, 48 మంది పిల్లలకు తండ్రయ్యాడు.. అదెలాగంటే..!

|

Aug 16, 2022 | 5:19 PM

Viral News: అతని వయసు 31.. అతనికి ఇంకా పెళ్లి కాలేదు.. అతను ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేడు.. కనీసం గర్ల్‌ఫ్రెండ్‌ కూడా లేదు.. కానీ, అతను ఒకరు కాదు ఇద్దరు కాదు..

Viral News: ఏ అమ్మాయితోనూ సెక్స్ చేయలేదు.. కానీ, 48 మంది పిల్లలకు తండ్రయ్యాడు.. అదెలాగంటే..!
Sperm Donor
Follow us on

Viral News: అతని వయసు 31.. అతనికి ఇంకా పెళ్లి కాలేదు.. అతను ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేడు.. కనీసం గర్ల్‌ఫ్రెండ్‌ కూడా లేదు.. కానీ, అతను ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 48 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. అదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి అమ్మాయిలతో సంబంధం లేకుండా 48 మందికి తండ్రి ఎలా అయ్యాడని బుర్ర గీక్కుంటున్నారా? కాస్త ఆగండి.. దాని వెనుకున్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పైన పేర్కొన్నది అక్షరాలా సత్యం. అయితే, దీని వెనుక సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి.

31 ఏళ్ల కైల్ గోర్డీ అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతను ఒక స్పెర్మ్ డోనర్. స్పెర్మ్ అవసరమైన అమ్మాయిలకు కైల్.. తన స్పెర్మ్‌ను దానం చేస్తాడు. స్పెర్మ్ బ్యాంకుకు వెళ్లకుండా నేరుగా స్పెర్మ్ అవసరమైన అమ్మాయిలకే దానం చేస్తాడు. దాతల వివరాలు స్మెర్మ్ బ్యాంకుల్లో గోప్యంగా ఉంచడం వల్ల కొంత మంది మహిళలు తెలియని వ్యక్తి నుంచి స్పెర్మ్ తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వారు అతని నుంచి సహాయం ఆశిస్తారని చెప్పుకొస్తున్నాడు కైల్. అయితే, కైల్ తన సేవ గురించి సోషల్ మీడియా వేదికగా ప్రచారం కూడా చేసుకుంటున్నాడు కూడా.

‘8 సంవత్సరాల క్రితం లెస్బియన్ జంట అభ్యర్థన మేరకు స్పెర్మ్ డొనేషన్ ప్రారంభించాను. తర్వాత చాలామంది ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్ చేయగా స్పందించాను. అలా నా స్పెర్మ్ డొనేషన్ ప్రక్రియ మొదలైంది. కానీ, నేను 10 సంవత్సరాలుగా ఎవరితోనూ డేటింగ్ చేయలేదు. నేను స్పెర్మ్ డోనర్ అని అమ్మాయిలకు పరిచయం చేసుకున్నప్పుడు వారు నాపై ఆసక్తి చూపలేకపోతున్నారు. నేను వారికి సహాయం చేస్తున్నానని ఇతర అమ్మాయిలు అర్థం చేసుకుంటారు. కానీ, ఇంత మంది పిల్లలు పుట్టడానికి కారణమైన నాతో సంబంధం పెట్టుకోవడానికి ఎవరూ ఇష్టపడరు’ అంటున్నాడు కైల్.

ఇవి కూడా చదవండి

అమ్మాయిల వైపు నుంచి ఆలోచించినప్పుడు వారి సెలక్షన్స్, వారి అభిప్రాయాలు వారికి ఉంటాయి. అయితే, కైల్ దృష్టిలో చూస్తే.. సహాయం, మానవత్వం, సామాజిక సేవగా, అతని వ్యక్తిగత ఆనందానికి మూలంగా కూడా ఉంటుంది. మొత్తంగా కైల్ కారణంగా 8 ఏళ్లలో 48 మంది అమ్మాయిలు తల్లులయ్యారు. ఇలా ఇతర కుటుంబాలు సంతోషంగా స్థిరపడేందుకు సాయపడే కైల్.. తనకంటూ ఒక తోడును వెతుక్కోపోవడం, సంబంధాన్ని కొనసాగించలేకపోవడం నిజంగా విడ్డూరమే కదా!

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..