వాస్తుపై మనలో చాలా మంది వాస్తును పాటిస్తుంటారు. వాస్తుకు అనుగుణంగానే ఇంటి నిర్మాణాన్ని చేపడుతుంటారు. వాస్తు.. ఆరోగ్యం మొదలు ఆర్థికం వరకు అన్నింటిపై ప్రభావం చూపుతుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుడాలన్నా, అప్పుల భారం తగ్గాలన్నా ఇంట్లో కొన్ని రకాల వాస్తు నియమాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వాస్తు నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంట్లో ఆగ్నేయ దిశకు ఎంతో ప్రధాన్యత ఉంటుంది. ఈ దిశను సంపదకు మూలం అంటారు. అందుకే ఈ దిశలో ఏర్పాటు చేసుకునే కొన్ని వస్తువులు సంపదను ఆకర్షిస్తాయని అంటున్నారు. అందుకే ఈ దిశలో మనీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఆగ్నేయంలో బీరువు, మంచం వంటి బలమైన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. అలాగే చెత్త డబ్బలు, చెప్పులనుకూడా ఈ దివలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఇంట్లో ఈశాన్యం దిశకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. దేవుడి స్థానంగా భావించే ఈశాన్యం దిశ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈశాన్యం దిశ శుభ్రంగా ఉండాలి. అలాగే ఈ దిశలో ఎలాంటి బరువైన వస్తువులను పెట్టకూడదు. ఇంట్లో పనికిరాని పాత వస్తువులను కూడా ఈ దిశలో ఉంచకూడదుని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగై, అప్పుల భారం తగ్గాలంటే ఉత్తర దిశ నుంచి గాలి, వెలుతరు వచ్చేలా చూసుకోవాలి. ఈ దిశలో కిటికీలు, తలుపులు ఉండేలా సెట్ చేసుకోవాలి.
అలాగే ఇంట్లో లాఫింగ్ బుద్ధ, తాబేలు వంటి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల కూడా ఆర్థిక పరిస్థితి మెరుగువుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే గోడలకు వేసుకునే రంగుల విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ముఖ్యంగా గోడలకు లైట్ కలర్స్ వేసుకోవాలి. అలాగే ఇంట్లో ఫిష్ అక్వేరియంతో పాటు వాటర్ ఫౌంటెన్ వంటివి ఏర్పాటు చేసుకోవాలి. ఈ వాస్తు నియమాలను పాటించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగై, అప్పుల భారం తగ్గుతుంది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..