Telangana: అమ్మ బాబోయ్.. ఎంత ధైర్యం! విష సర్పమని తెలిసి.. ప్రాణాలు కాపాడిన రైతు..!

| Edited By: Balaraju Goud

Jun 24, 2024 | 1:26 PM

విష సర్పం కనిపిస్తే చాలు వామ్మో పాము అంటూ ఆమడ దూరం వెళ్తారు జనం. ఎక్కడ తమను కాటేస్తుందో.. ఎక్కడ ప్రాణాలు తీసేస్తుందోనని, ఏకంగా ఆ పామును చంపించేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఓ రైతు మాత్రం అలా చేయలేదు. ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా.. గాయాల పాలైన ఓ పామును కాపాడి వైద్యం అందించి ప్రాణాలు రక్షించాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

Telangana: అమ్మ బాబోయ్.. ఎంత ధైర్యం! విష సర్పమని తెలిసి.. ప్రాణాలు కాపాడిన రైతు..!
Tratment To Snake
Follow us on

విష సర్పం కనిపిస్తే చాలు వామ్మో పాము అంటూ ఆమడ దూరం వెళ్తారు జనం. ఎక్కడ తమను కాటేస్తుందో.. ఎక్కడ ప్రాణాలు తీసేస్తుందోనని, ఏకంగా ఆ పామును చంపించేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఓ రైతు మాత్రం అలా చేయలేదు. ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా.. గాయాల పాలైన ఓ పామును కాపాడి వైద్యం అందించి ప్రాణాలు రక్షించాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

వర్షకాలం వచ్చిందంటే చాలు రైతుల పాలిట పాములు ప్రాణాంతకంగా మారుతాయి. ఖరీప్ సీజన్ లో వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో ఎక్కడో ఓ చోట పాము కాటు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. విష సర్పాల నుండి ప్రాణాలు రక్షించుకునేందుకు జాగ్రత్త చర్యలు తీసుకున్నా రైతులకు పాము కాట్లు తప్పవు. అలాంటిది విష సర్పమని తెలిసి.. కనిపిస్తే కాటు వేస్తుందని తెలిసి కూడా ఓ రైతు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ నాగుపామును రక్షించి ప్రాణాలు కాపాడాడు. పొలం పనులు చేస్తుండగా తన కారణంగా ప్రమాదంలో పడిందని తెలుసుకుని మానవత్వంతో ఆలోచించి విష సర్పంకు ప్రాణం పోశాడు ఓ రైతు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో ఓ రైతు గొప్ప మనసును చాటుకున్నాడు. విష సర్పం అని తెలిసినా.. ప్రాణం తీస్తుందని తెలిసినా.. తన పొలంలో పొలం పనులు చేస్తుండగా పాము గాయపడింది. దాన్ని గమనించిన ఆ రైతు, వెంటనే ఆ పామును సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించాడు.
సకాలంలో పామును కాపాడి శభాష్ అనిపించుకున్నాడు రామయ్య అనే రైతు.

వీడియో..

చంద్రవెల్లి గ్రామంలో రామయ్య అనే రైతు పత్తి సాగు చేసేందుకు ట్రాక్టర్ తో పొలం దున్నుతుండగా.. ఓ నాగుపాము ట్రాక్టర్ ఇనుప కడ్డీలకు చుట్టుకుని గాయపడింది. గుర్తించిన రైతు పామును కాపాడిన రైతు విష సర్పం అని తెలిసి కూడా వెటర్నరీ ఆస్పత్రికి తరలించి నాగు పాము కు చికిత్స చేయించాడు‌. చికిత్స అందించిన బెల్లంపల్లి వెటర్నరీ డాక్టర్ దిలీప్.. నాగుపాముకు తలభాగంలో గాయం అయినట్టుగా గుర్తించి వైద్యం అందించి స్నేక్ క్యాచర్ నాగరాజుకు ఆ పామును అప్పగించాడు‌. నాగరాజు కోలుకున్న ఆ పామును అటవీ ప్రాంతంలో వదిలేసి స్వేచ్ఛ కల్పించాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు రైతును ప్రశంసలతో ముంచెత్తారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…