Capgemini: మీరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే.. 30,000 ఉద్యోగాలు..

|

Feb 26, 2021 | 9:43 PM

Capgemini To Hire 30,000: కరోనా మహమ్మారి కారణంగా ప్రభావితమైన రంగాల్లో ఉద్యోగ రంగం ఒకటి. లాక్‌డౌన్‌ విధించడం.. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. అదే తరుణంలో కొత్త ఉద్యోగాల..

Capgemini: మీరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే.. 30,000 ఉద్యోగాలు..
Follow us on

Capgemini To Hire 30,000: కరోనా మహమ్మారి కారణంగా ప్రభావితమైన రంగాల్లో ఉద్యోగ రంగం ఒకటి. లాక్‌డౌన్‌ విధించడం.. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. అదే తరుణంలో కొత్త ఉద్యోగాల సృష్టి కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా బీటెక్‌ లాంటి టెక్నికల్‌ డిగ్రీలు చదివిన వారికి ఉద్యోగాలు వస్తాయా.? రావా అన్ని ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. కంపెనీలు ఉద్యోగ నియమకాలు చేపడుతుండడంతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్‌ జెమిని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్‌ న్యూస్‌ చెప్పే యోచనలో ఉంది. ఈ ఏడాదికి గాను (2021) ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఏకంగా సుమారు 30,000 మంది ఐటీ ఉద్యోగులను రిక్రూట్ చేసుకోన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని క్యాప్‌ జెమిని సీఈవో అశ్విన్‌ యార్డి వెల్లడించారు. ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న వారికి కూడా అవకాశం కల్పించనున్నట్లు చెప్పుకొచ్చారు. కృత్రిమేథ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ), కౌడ్‌ టెక్నాలజీ, 5జీ, సైబర్‌ సెక్యూరిటీ, ఇంజినీరింగ్‌, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ లాంటి డిజిటల్‌ స్కిల్స్‌పై నియామకాలు చేపడుతున్నట్లు సీఈఓ తెలిపారు.
ఇక నియామకాల సంఖ్య గతేడాది పోలిస్తే 25 శాతం పెరగడం విశేషం. ఏ కరోనా అయితే ఉద్యోగాలు కోల్పోయేలా చేసిందో ఇప్పుడు అదే కరోనా ఉద్యోగాల కల్పనకు కారణమవుతుందని అశ్విన్‌ చెప్పుకొచ్చారు. కరోనా నేపథ్యంలో డిజిటల్‌ సొల్యూషన్‌కు పెరిగిన భారీ డిమాండ్‌ వ్యాపార అవకాశాలను మెరుగుపరిచిందని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే క్యాప్‌ జెమినికి భారత్‌లో మొత్తం 1,25,000 మంది ఉద్యోగులు ఉండగా గతేడాది ఈ సంస్థ దాదాపు 24 వేల నియామకాలను చేపట్టింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ నియామకాలు భారీగా పుంజుకుంటున్నాయి. ఇప్పటికే.. ఇన్ఫోసిస్ 15 వేల మంది గ్రాడ్యుయేట్లను నియమించుకోగా.. కాగ్నిజెంట్ 2021లో దాదాపు 23,000 మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన చూస్తుంటే ఈ ఏడాది ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పనకు ఢోకా లేదనిపిస్తోంది.

Also Read: Bird kills man at cockfight: కోడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏ1 ముద్దాయిగా చేర్చారు.. అసలు విషయం ఏంటంటే..?

Uppena Movie : కొనసాగుతున్న ‘ఉప్పెన’మూవీ మానియా.. ఆకట్టుకుంటున్న మేకింగ్ వీడియో..

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం.. పలువురు మంత్రులకు కీలక బాధ్యతలు.. ఆదేశాలు జారీ