AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heartbreaking Incident: కర్నూలు జైలు దగ్గర గుండెలు పిండేసిన ఘటన.. తల్లి కోసం కన్నీరుమున్నీరుగా విలపించిన బిడ్డ!

అమ్మ ఏమి చేసిందో ఆ చిన్నారికి తెలియదు.. బిడ్డను ఓదార్చేందుకు ఆ తల్లికి దారి లేదు... తల్లీబిడ్డల బంధాన్ని జైలు గోడలు దూరం చేశాయి. తల్లి దూరమైందన్న ఆవేదన ఆ ఏడేళ్ల చిన్నారి నుంచి కన్నీటి రూపంలో ఉబికి వస్తోంది. అమ్మను చూడాలని, అమ్మతో మాట్లాడాలని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ చిన్నారిని చూసిన వాళ్లందరి కళ్లలో నీళ్లు తిరిగాయి.

Heartbreaking Incident: కర్నూలు జైలు దగ్గర గుండెలు పిండేసిన ఘటన.. తల్లి కోసం కన్నీరుమున్నీరుగా విలపించిన బిడ్డ!
Girl Tears For Mother
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Dec 16, 2023 | 1:24 PM

Share

అమ్మ ఏమి చేసిందో ఆ చిన్నారికి తెలియదు.. బిడ్డను ఓదార్చేందుకు ఆ తల్లికి దారి లేదు… తల్లీబిడ్డల బంధాన్ని జైలు గోడలు దూరం చేశాయి. తల్లి దూరమైందన్న ఆవేదన ఆ ఏడేళ్ల చిన్నారి నుంచి కన్నీటి రూపంలో ఉబికి వస్తోంది. అమ్మను చూడాలని, అమ్మతో మాట్లాడాలని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ చిన్నారిని చూసిన వాళ్లందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. జైలు గోడకు అటుగా ఉన్న తల్లి కోసం, ఆ జైలు ముందే అమ్మా. అమ్మా.. అంటూ తడారిన గొంతుతో పిలుస్తున్న ఆ చిన్నారి పిలుపు మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. శుక్రవారం కర్నూలు రూరల్ తహసీల్దారు కార్యాలయం ప్రాంగణంలోని మహిళా సబ్ జైలు ఎదుట కనిపించిన దృశ్యమిది.

కర్నూలు పాతనగరానికి చెందిన ఓ మహిళ చోరీ కేసులో పట్టుబడగా పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఆమెను మహిళా సబ్ జైలులో ఉంచారు. కానీ తల్లి ఎలాంటి తప్పు చేసిందో ఆ చిన్నారికి తెలియదు. ఆమె చేసిన నేరం గురించి ఆలోచించే వయస్సు కూడా ఆ బాలికకు లేదు. కేవలం అమ్మ దూరమైందన్న ఆవేదన ఆ చిన్నారిని జైలు వరకు వచ్చేలా చేసింది. తల్లిని చూడాలన్న ఆరాటం జైలు తలుపు తడుతూ ఆవేదనతో అక్కడే ఉండిపోయేలా చేసింది.

స్థానికులు కొంత మంది జైలు అధికారులను విజ్ఞప్తి చేయగా జైలు అధికారులు ఆ తల్లిని మరోసారి బయటకు పిలిపించి కూతురికి చూపించారు. ఆ తర్వాత కూతురును కూడా లోపలికి తీసుకెళ్లింది. అనంతరం జైలు అధికారులు ఆ బిడ్డను వారి బంధువుల ద్వారా ఇంటికి పంపించి వేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
పాక్‌పై అభిషేక్ శర్మ కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డ్ బ్రేక్..
పాక్‌పై అభిషేక్ శర్మ కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డ్ బ్రేక్..
హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు.. పండుగల వేళ కొనుగోలుదారులకు ఊరట!
హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు.. పండుగల వేళ కొనుగోలుదారులకు ఊరట!
అయూబ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన అభిషేక్.. వైభవ్ పగ తీర్చేశాడుగా
అయూబ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన అభిషేక్.. వైభవ్ పగ తీర్చేశాడుగా
పుట్టింటికి బయలుదేరిన తల్లీపిల్లలు.. బావిలో విగతజీవులుగా..!
పుట్టింటికి బయలుదేరిన తల్లీపిల్లలు.. బావిలో విగతజీవులుగా..!
దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!
దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!
GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్
GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్
సెలవు రోజు సరదాగా వెళ్లి.. కెరటాల్లో ముగ్గురు పిల్లలు గల్లంతు!
సెలవు రోజు సరదాగా వెళ్లి.. కెరటాల్లో ముగ్గురు పిల్లలు గల్లంతు!
Video: వైభవ్ ఔట్‌పై పాక్ ప్లేయర్ ఓవర్ యాక్షన్..
Video: వైభవ్ ఔట్‌పై పాక్ ప్లేయర్ ఓవర్ యాక్షన్..
బర్త్ డే రోజున హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన అభిమాని..
బర్త్ డే రోజున హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన అభిమాని..
సుప్రీంకోర్టులో 250 ఉద్యోగాలు.. అక్టోబర్‌ 28లోగా అప్లై చేసుకోండి
సుప్రీంకోర్టులో 250 ఉద్యోగాలు.. అక్టోబర్‌ 28లోగా అప్లై చేసుకోండి