Viral Photo: చిరిగిన డ్రస్‌కు లక్ష రూపాయాలా..? నెట్టింట వైరల్‌గా మారిన రంధ్రాల స్వెటర్‌..

Prada Company Hole Sweater: ఫ్యాషన్‌ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ అర్థం కాదు. ఒకప్పుడు బూట్‌ కట్‌ ట్రెండ్‌గా నడిస్తే.. ఇప్పుడు పెన్సిల్‌ కట్‌ హవా నడుతస్తోంది. ఇక టోన్‌ జీన్స్‌ పేరుతో ఇప్పుడు చిరిగిన ప్యాంట్లు..

Viral Photo: చిరిగిన డ్రస్‌కు లక్ష రూపాయాలా..? నెట్టింట వైరల్‌గా మారిన రంధ్రాల స్వెటర్‌..
Follow us

|

Updated on: Feb 02, 2021 | 12:32 AM

Prada Company Hole Sweater: ఫ్యాషన్‌ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ అర్థం కాదు. ఒకప్పుడు బూట్‌ కట్‌ ట్రెండ్‌గా నడిస్తే.. ఇప్పుడు పెన్సిల్‌ కట్‌ హవా నడుతస్తోంది. ఇక టోన్‌ జీన్స్‌ పేరుతో ఇప్పుడు చిరిగిన ప్యాంట్లు వేసుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారింది.

తాజాగా ఓ సరికొత్త స్వెటర్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇటాలీకి చెందిన ప్రద అనే ప్రముఖ వస్త్ర సంస్థ ఓ స్వెటర్‌ను రూపొందించి. దాన్ని ప్రస్తుతం అమ్మకానికి పెట్టిందా సంస్థ. దీంతో ప్రస్తుతం ఆ స్వెటర్‌ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఆ స్వెటర్‌ ధర ఎంతో తెలుసా.. అక్షరాల రూ.90వేలకు పైమాటే. సుమారు రూ.లక్ష ధర చేసే ఆ స్వెటర్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో అని మాత్రం అనుకోకండి ఎందుకంటే దాన్ని చూస్తే మీ అభిప్రాయం మార్చుకోక తప్పదు. స్వెటర్‌పై అక్కడక్కడ రంధ్రాలు ఉండేలా దీన్ని రూపొందించారు. పసుపు వర్ణంలో ఉన్న ఈ స్వెటర్‌ చూడడానికి అచ్చంగా చీజ్‌లా కనిపిస్తోంది. దీంతో ఈ స్వెటర్‌పై నెట్టింట్లో ఓ రేంజ్‌లో జోక్‌లు పేలుతున్నాయి. చిరిగిన స్వెటర్‌కు రూ.లక్ష రూపాయాలా..? అని ఓ నెటిజన్‌ స్పందించగా.. దీన్ని చూస్తుంటే నాకు చీజ్‌ గుర్తొస్తుందంటూ మరో వ్యక్తి స్పందించాడు. ఏదేమైనా ప్రస్తుతం ఈ స్వెటర్‌ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.

ఇక ఈ రంధ్రాల స్వెటర్‌పోస్టుకు ఓ నెటిజన్‌ రాజేంద్రప్రసాద్‌ హీరోగా నటించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలోని వీడియోను కామెంట్‌ సెక్షన్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ సినిమాలో కూడా హీరో తన వినూత్న ఐడియాతో పాత డ్రస్‌లకు రంధ్రాలు పెట్టి సరికొత్త ట్రెండ్‌ అంటూ అమ్మేస్తాడు. ఇప్పుడీ చీజ్‌ స్వెటర్‌ చూస్తుంటే రాజేంద్రప్రసాద్‌ సినిమా సీన్‌ గుర్తొస్తుంది.

Also Read: Extraordinary Indian Woman: 50 పైసలతో జర్నీ షురూ.. నేడు 14 కోట్ల టర్నోవర్.. సాధించిందో మహిళ