Viral News: వామ్మో.. అతడి బరువు 435 కిలోలు.. రోజూకి 3 కిలోల మాంసం తినేస్తాడట.. “పాకిస్తాన్ హాల్క్” తెలుసా ?

|

Jan 06, 2021 | 2:57 PM

అతడి బరువు 435 కిలోలు, రోజూ 10 వేల క్యాలరీ ఆహారాన్ని తినేస్తాడట. అంతేకాకుండా ఒంటి చెత్తో కార్లను, బైకులను ఎత్తేస్తాడు. అతనేవరో కాదండోయ్ అర్బాజ్ ఖిజేర్ హయత్.

Viral News: వామ్మో.. అతడి బరువు 435 కిలోలు.. రోజూకి 3 కిలోల మాంసం తినేస్తాడట.. పాకిస్తాన్ హాల్క్ తెలుసా ?
Follow us on

అతడి బరువు 435 కిలోలు, రోజూ 10 వేల క్యాలరీ ఆహారాన్ని తినేస్తాడట. అంతేకాకుండా ఒంటి చెత్తో కార్లను, బైకులను ఎత్తేస్తాడు. అతనేవరో కాదండోయ్ అర్బాజ్ ఖిజేర్ హయత్. ఇతను పాకిస్తాన్‏లోని మాద్రాన్ జిల్లాలో నివసిస్తుంటాడు. ఇతడిని అంతా “పాకీస్తానీ హల్క్” అని పిలుస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాడు అర్బాజ్.

అర్బాజ్ ఖిజేర్ హయత్.. పాకిస్తాన్ దేశంలోని మాద్రాన్ జిల్లాలోని నివసిస్తున్నాడు. రోజూ ఉదయం అల్పహారంలోకి కోడిగుడ్లు, రోజూ 3 కిలోల మాంసం, 5 లీటర్ల పాలు తాగేస్తాడట. మొత్తానికి ఒక రోజులో 10 వేల క్యాలరీల ఆహారాన్ని తింటాడట. ఇంత బరువు ఉన్న అర్బాజ్‏కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవంట. తన ఫిట్‏నెస్ పై ఎలాంటి అశ్రద్ద చూపించకుండ.. ఇంకా తన బరువును పెంచుకోవడానికి ఇష్టపడుతున్నాడట. ప్రస్తుతం అర్బాజ్ వయసు కేవలం 28 ఏళ్ళే. ఇక ఇతడిని పెళ్ళి చేసుకోవడానికి అనేక మంది అమ్మాయిలు క్యూ కడుతున్నారు. దాదాపు 300 అమ్మాయిలను అర్బాబ్ తిరస్కరించాడు. 100 కిలోల లోపు బరువు ఉండే అమ్మాయిలను తాను పెళ్ళి చేసుకోనని.. తనలాగా బొద్దుగా ఉండే అమ్మాయిలను మాత్రమే చేసుకుంటానని అర్బాజ్ తెలిపాడు. అంతే కాకుండా WWE ఛాంపియన్ కావాలని ఉందని తెలిపాడు అర్బాజ్.

అయితే అర్బాజ్ చేప్పె మాటలన్ని అబద్ధాలని పాకిస్థాన్‏కు చెందిన వ్రెస్ట్‏లర్ ఉస్మాన్ బుల్లెట్ ఆరోపించాడు. కేవలం పాపులారిటీ కోసమే అర్బాజ్ అల మాట్లాడుతున్నాడని.. ఇంతకు ముందు తనతో పోటి పడాలని అర్బాజ్‏కు ఛాలెంజ్ విసిరానని.. కానీ ఇప్పటి వరకు అతడు స్పందించలేదని తెలిపాడు. కేవలం ఇండియాకు చెందిన గ్రేట్ కాళీతో తలపడతానని చెప్తున్నాడు. కానీ అది కుదరదు ఎందుకంటే కాళీ పాకిస్తాన్ రాలేడు.. అందుకే అర్బాజ్ ఈ వ్యాఖ్యలను చేస్తున్నాడని మండిపడ్డాడు.

Also Read: చికెన్, గుడ్లు తినొచ్చు, ఏపీలో బర్డ్ ఫ్లూ లేదు, వలస పక్షులతో అప్రమత్తంగా ఉన్నాం: పశుసంవర్ధక శాఖ డైరెక్టర్