Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెల్‌ఫోన్ ఉంది కదాని భార్య చిలిపి పని.. విషయం తెలిసి విడాకులు ఇచ్చిన భర్త.. ఇంతకీ ఏం చేసిందంటే..?

భార్య, భర్త అనున్య దాంపత్యం మధ్యలో చిన్న చిన్న పనులే చిచ్చు పెడుతున్నాయి. భార్య చేసిన ఓ చిలిపి పనికి విడాకులు ఇచ్చేశాడు ఓ భర్త.

సెల్‌ఫోన్ ఉంది కదాని భార్య చిలిపి పని.. విషయం తెలిసి విడాకులు ఇచ్చిన భర్త.. ఇంతకీ ఏం చేసిందంటే..?
Man Divorces Wife
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 06, 2021 | 8:56 AM

Man Divorces Wife: భార్య, భర్త అనున్య దాంపత్యం మధ్యలో చిన్న చిన్న పనులే చిచ్చు పెడుతున్నాయి. భార్య చేసిన ఓ చిలిపి పనికి విడాకులు ఇచ్చేశాడు ఓ భర్త. ఈ ఘటన జోర్డాన్ దేశంలో చోటుచేసుకుంది. తన తల్లి నిద్రపోతున్న సమయలో చేసిన గురకను రికార్డ్ చేయడం ఈ వివాదం తలెత్తింది. దీంతో జోర్డాన్‌కు చెందిన వ్యక్తి తన భార్యకు విడాకులు ఇచ్చాడని గల్ఫ్ దేశానికి చెందిన స్థానిక మీడియా పేర్కొంది.

వివరాల్లోకెళితే, అత్తగారు రోజు నిద్రపోతున్న సమయంలో గురక పెడుతుండటంతో కోడలుకు చిరాకు తెప్పించింది. దీంతో ఏకంగా గరక పెట్టినట్లు వాయిస్ నోట్‌ను రికార్డ్ చేసి తన కుటుంబ సభ్యుల వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేసింది. దీంతో దంపతుల మధ్య వివాదం మొదలైంది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఆ వ్యక్తి ఆగ్రహానికి గురయ్యాడు. తరువాత జరిగిన తీవ్ర వాగ్వాదంలో, ఆ వ్యక్తి తన భార్యకు విడాకులు ఇచ్చాడు.

ఇదిలా వుంటే గత దశాబ్ద కాలంగా జోర్డాన్‌లో విడాకుల కేసులు బాగా పెరిగాయని స్థానిక మీడియా పేర్కొంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం, 2016లో, ఇది మిడిల్ ఈస్ట్‌లో అత్యధిక విడాకుల రేటు నమోదైనట్లు తెలిపింది. 2011లో 1,000గా ఉన్న విడాకుల సంఖ్య.. 2016లో 21,969కి పెరిగింది. చిన్న చిన్న సంఘటనలతోనే దంపతులు విడాకుల దాకా వెళ్తున్నారని వెల్లడించింది.

అయితే, కొంత మంది నిద్రపోయేటప్పుడు నోరు తెరచి నిద్రపోతారు. అప్పుడు వారు ముక్కుతో కాకుండా నోటితో గాలి పీల్చి, వదులుతుంటారు. అయితే… నోట్లోంచీ గాలి ముక్కు రంధ్రాల్లోకి వెళ్లే ప్రయత్నంలో పెద్ద ఎత్తున శబ్దం వస్తుంది. అదే గురక. అలవాటుగా మారి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also…  సంచలనాలకు సిద్ధమైన మారుతి సుజుకి.. ఇండియాలోనే అత్యధిక మైలేజ్‌ కారుతో మార్కెట్‌లోకి ఎంట్రీ.. పూర్తి వివరాలు మీకోసం..!

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!