సంక్రాంతి పండుగ అంటే సందడి. సంక్రాతి పండగ వచ్చిందంటే చాలు.. అంతటా గాలి పటాల సందడి ఉంటుంది. దేశమంతా వేర్వేరు పేర్లతో పండగ జరుపుకున్నా పతగులు మాత్రం కామన్. సంకాంతికి ముందుగా గుర్తుకు వచ్చేవి చకినాలు, అర్షలు, పతంగులే.. తెలంగాణ మొత్తం దాదాపుగా ఇదే సందడి కనిపిస్తుంది. తెలంగాణలో మాత్రమే కాదు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ పతంగలు ఎగురవేస్తుంటారు. పొంగల్ పండగ వేళ దేశమంతటా రంగు రంగుల పతంగులు ఎగురవేస్తుంటారు. పతంగులు ఎగరేయడంలో పిల్లలతోపాటు పెద్దలు కూడా చేరిపోతారు. డిసెంబర్ నెలలో మొదలయ్యే పతంగులు జనవరి చివరి దాకా కొనసాగుతుంది.
బాగా వెలుతురు, గాలులు వీచే రోజులు డిసెంబర్ చివరి వారం నుంచి జనవరి చివరి వారం వరకు వీస్తుంటాయి. గాలిపటం ఎగురవేయడం వల్ల కలిగే ఆనందం వేరే లెవల్ అని చెప్పవచ్చు. కొని తెచ్చుకున్న గాలిపటం కంటే మనలో చాలా మంది స్వయంగా తయారు చేసుకుంటారు. అయితే కొని తెచ్చుకున్న పతంగికి కూడా పాసాంగం కట్టుకోవాల్సింది మాత్రం మనమే. ఇలా మీ స్వంతంగా తయారు చేసిన గాలిపటాన్ని ఎగురవేయండి! సరళమైన డైమండ్ ఆకారపు గాలిపటం తయారు చేయడం అనేది మీరు కేవలం కొన్ని గంటల్లో పూర్తి చేయగల సులభమైన ప్రాజెక్ట్. ఫ్రేమ్‌ను ఎలా నిర్మించాలో, గాలిపటం తెరచాప లేదా షీర్‌ను ఎలా నిర్మించాలో దానిని కలిసి ఉంచడం ఎలాగో మీకు చూపుతుంది. అప్పుడు, మీరు మీ చేతితో తయారు చేసిన గాలిపటాన్ని ఆకాశంలో ఎగురవేయడం ఆనందించవచ్చు. అయితే, వీటిని మీరే ఇంట్లో తయారు చేసి ఎగరేస్తే ఎంతో బాగుంటుంది కదా.. ఆ తయారీ ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పుడు పేపర్ని సరిగ్గా త్రిభుజం ఆకారంలో మడతపెట్టి.. ఎక్కువగా ఉన్న పేపర్ని కట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఆ చతురస్ర ఆకారంలో పేపర్ రెడీ అవుతుంది. ఇప్పుడు చీపురు పుల్లకి లేదా వెదురు ఫెవికాల్ రాసి పేపర్ని రెండు త్రిభుజాలుగా విడదీసే విధంగా మధ్యలో అతికించాలి లేదా మీరు తెచ్చుకున్న టేప్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి అతికించండి. తర్వాత.. ఇంకో చీపురుపుల్లని మధ్యలో అతికించిన పుల్లకి అడ్డంగా అటు చివర ఇటు చివర పైకి వలయకారంలో వచ్చేటట్టు టేప్ అతికించాలి. ఇప్పుడు దానికి కిందివైపున ఒక పేపర్‌తో ఎండింగ్‌లా చేసి తోకని అతికించాలి.. దీనికి దారం కడితే సరి.. గాలిపటం సిద్దమవుతంది..
పెద్దపెద్దగాలిపటాలను మడతపెట్టటానికి వీలుగా మడతకీళ్ళ (హింజ్ ) లతో తయారుచేస్తారు. ఎటుచూసినా ఒకే మాదిరిగా ఉండే గాలిపటాల ముక్కును గాలివీచేదిశలో వుంచటానికి తోకను వాడతారు. మన ఇష్టాన్ని బట్టి.. పేపర్‌తో కానీ, స్టైలిష్ కలర్ ప్లాస్టిక్ పేపర్‌తో కాని తయారు చేసుకోవచ్చు. అంతేకాదు.. డిజైన్స్‌ని కూడా మన ఇష్టంగా కట్ చేసుకోవచ్చు. కానీ చీపురు పుల్లలు మాత్రం ఈ విధంగానే పెట్టాలి…
అయితే గాలిపటం ఇంట్లో తయారు చేసుకున్న బయట కొని తెచ్చుకున్న అసలు ముఖ్యమైనది మాత్రం దానికి కంటే దారం లేదా మాంజా. ఇది అత్యంత కీలకం. ఎందుకంటే ఇది సరిగ్గా కడితేనే పతంగి గాలిలోకి లేస్తుంది. అయితే ముందుగా మీరు వెదురు పుల్లలు కట్టిన వైపు నుంచి కాకుండా మరో వైపు మాంజా కట్టాల్సి ఉంటుంది. ఇలా సరైన కొలతలతో మాంజా కట్టాల్సి ఉంటుంది.
మరింకెందుకు ఆలస్యం.. మీరే తయారు చేసి మీ ఇంట్లోనివారికి గిఫ్ట్‌గా ఇవ్వండి. అంతేకాదు మీ చిన్నారులకు నేర్పించండి..
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం