Salt Purity Check: మీరు వాడుతున్న ఉప్పు కల్తీదా? నిజమైనదా? ఇలా గుర్తించండి..!

|

Feb 11, 2023 | 9:29 AM

Salt Purity Check: ఎంతటి నలభీముడు అయినా తాను వండిన వంటకంలో సరిపడా ఉప్పు వేయకుండా ఆ వంట వృధానే అవుతుంది. వంటల్లో ఉప్పు ప్రాధాన్యత అలాంటిది మరి. ఉప్పు లేకుండా ఆ వంటకం ఎంత టేస్టీగా చేసినా వృధానే.

Salt Purity Check: మీరు వాడుతున్న ఉప్పు కల్తీదా? నిజమైనదా? ఇలా గుర్తించండి..!
Follow us on

ఎంతటి నలభీముడు అయినా తాను వండిన వంటకంలో సరిపడా ఉప్పు వేయకుండా ఆ వంట వృధానే అవుతుంది. వంటల్లో ఉప్పు ప్రాధాన్యత అలాంటిది మరి. ఉప్పు లేకుండా ఆ వంటకం ఎంత టేస్టీగా చేసినా వృధానే. అంతేకాదు.. వంటల్లో ఉపయోగించే ఉప్పు.. మని ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఉప్పులో ఉండే అయోడిన్ మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన, మనం నిత్యం వాడుతున్న ఉప్పు.. నిజంగా నిజమైనదేనా? ప్రస్తుత కాలంలో తాగే నీరు మొదలు అన్నీ కల్తీ చేస్తున్నారు. మరి ఉప్పు కల్తీ చేయడం పెద్ద అసాధ్యమేమీ కాదు. అందుకే.. మీరు రోజు తినే ఉప్పు నిజమైనదేనా? కల్తీదా? ఒక వేళ ఆ ఉప్పు కల్తీది అయితే ఎలా గుర్తించాలి? టెన్షన్ పడకండి.. కల్తీ ఉప్పును ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఉప్పు కల్తీదా? ఒరిజినలా? ఇలా తెలుసుకోండి..

ముందుగా ఒక బంగాళదుంపను తీసుకోవాలి. దానిని రెండు ముక్కులుగా కట్ చేయాలి. ఒక వైపు ముక్కకు ఉప్పు వేయాలి. 3 నుంచి 4 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు ఉప్పు రాసిన చోట రెండు చుక్కల నిమ్మరసం వేయాలి. నిమ్మరసం కలిపిన తరువాత ఉప్పు నీలం రంగులోకి మారినట్లయితే అది కల్తీ ఉప్పు అని అర్థం చేసుకోవాలి. లేదంటే.. ఒరిజినల్‌ ఉప్పుగా భావించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆఫ్‌బీట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..