Snake Viral Video: ప్రపంచ వ్యాప్తంగా పాముల్లో వందలకొద్దీ జాతులున్నాయి. కానీ వీటిలో కొన్ని పాములు చాలా విషపూరితమైనవి.. అవి కాటు వేస్తే కొన్ని సెకన్లలో మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాంటి విషపూరిత పాములలో ఒకటి కోబ్రా.. సహజంగా ఇవి జనారణ్యంలో కనిపించవు. అరుదుగా మాత్రమే ఇవి.. ఆహారం కోసం జనావాస ప్రాంతాలకు వస్తుంటాయి. కోబ్రా పడగను విప్పి ప్రజలకు కనిపించడం అరుదుగా కనిపించే దృశ్యం. పడగ విప్పిన కోబ్రాను చూస్తే ఎవరికైనా భయమేస్తుంది.
ఒక గోల్ఫ్ కోర్స్ మైదానంలో పచ్చటి గడ్డి మీద కోబ్రా వేగంగా పాకుతూ కెమెరాకు చిక్కింది. ఈ వీడియోలో కోబ్రాను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఈ కోబ్రాకు వెనుక ఒక ముంగిస కూడా కనిపిస్తోంది. ఈ ముంగిస వెంటపడటంతో ఆ కోబ్రా పారిపోతున్నట్లు ఈ వీడియోను చూస్తే అర్ధమవుతుంది. ప్రాణభయంతో కోబ్రా పడగవిప్పి పారిపోతున్న దృశ్యం నెటిజన్లను కళ్లార్పనివ్వదు. కేప్ టౌన్‌లోని గోల్ఫ్ కోర్స్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో @elitapeachey అనే యూజర్ ఈ షాకింగ్ వీడియోను ఆరు రోజుల క్రితం పోస్ట్ చేశారు. ఈ వీడియోకి ఇప్పటివరకు 3 లక్షల 49 వేల వీక్షణలు మరియు 2.5 వేల లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోను చూసిన తర్వాత వందలాది మంది యూజర్లు కామెంట్ చేశారు.
పడగవిప్పి పారిపోతున్న పాము..
కోబ్రా వీడియో చాలా భయానకంగా ఉందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కోబ్రా గడ్డి పరకలపై పడగవిప్పి వేగంగా పాకడం గతంలో ఎప్పుడూ చూడలేదని కొందరు చెబుతున్నారు. అదే సమయంలో అటవీ ప్రాంతాల్లో గోల్ఫ్ కోర్సులు నిర్మించి.. వన్య ప్రాణులను ఎందుకు ఇబ్బందిపెడుతారని కొందరు జంతు ప్రియులు ప్రశ్నిస్తున్నారు. అటవీ ప్రాంతంలో గోల్ఫ్ కోర్స్‌లు నిర్మిస్తే.. అక్కడ పాములు రావడం వింతేమీ కాదని వారు కామెంట్ చేస్తున్నారు. వీడియోలో వెనుక ముంగిస కనిపిస్తోంది.. అయితే పాముపై ఎందుకు దాడి చేయలేదో అర్ధం కావడం లేదని కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.