Vastu Tips: అపారమైన సంపద సొంతమవ్వలా.? ఈ వాస్తు చిట్కాలను పాటించండి..

|

Oct 18, 2024 | 3:14 PM

భారతీయులు వాస్తును బాగా విశ్వసిస్తారని తెలిసిందే. అందుకే ఇంటి నిర్మాణం వాస్తుకు అనుగుణంగానే ఉండాలని చెబుతుంటారు. కానీ మనం తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పుల వల్ల వాస్తు దోషాలు ఏర్పడుతాయి. దీంతో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటి కొన్ని వాస్తు చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Vastu Tips: అపారమైన సంపద సొంతమవ్వలా.? ఈ వాస్తు చిట్కాలను పాటించండి..
Vastu
Follow us on

భారతీయుల్లో వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ ఒక్కరూ ఇంటి నిర్మాణం విషయంలో వాస్తును కచ్చితంగా ఫాలో అవుతుంటారు. వాస్తుకు అనుగుణంగానే ఇంటి నిర్మాణం చేపడుతుంటారు. అందుకే వాస్తు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పండితలు సైతం సూచిస్తుంటారు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దూరమై, ఆర్థికంగా బలోపేతం అవ్వాలంటే కొన్ని వాస్తు నియమాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వాస్తు నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* దేవుడి గది విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపునులు చెబుతున్నారు. ముఖ్యంగా పూజ గదిలో ప్రతీ రోజూ కచ్చితంగా ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలని పండితులు చెబుతున్నారు. పూజ గదిలో కొందరు చనిపోయిన పెద్దల ఫొటోలను పెడుతుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని అంటున్నారు. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

* గోడలపై జలపాతాలు, ఉదయిస్తున్న సూర్యుడు వంటి ఫొటోలను అతికించుకోవాలి. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. ఇలాంటి ఫొటోలను ఏర్పాటు చేయడం ద్వారా ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు దూరమవుతాయి. తరచూ కుటుంబ సభ్యుల మధ్య తలెత్తే వివాదాలు తగ్గిపోతాయి.

* వాస్తు శాస్త్రంలో ఈశాన్యం దిశకు ఎంతో ప్రాధానత్య ఉంటుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈశాన్యంలో ఎలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి. ఈశాన్యం దిశ నిత్యం శుభ్రంగా ఉండేలా జాగ్రత్తపడాలి. చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు.

* ఇక ఇంట్లో మతపరమైన పుస్తకాలను తప్పుడు దిశలో ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. మతపరమైన పుస్తకాలను ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ దిశలోనే ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో పరుపు కింద లేదా, పిల్లో కింద ఇలాంటి పుస్తకాలను పెట్టుకోకూడదు.

* వాస్తు శాస్త్రంలో చీపురుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే చీపురు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయకూడదు. చీపురుకు కళ్లు తగిలే విధంగా ఉండకూదు. చీపురు ఉన్న స్థలంపైన ఎలాంటి బరువైన వస్తువులు లేకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

* వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఎండిన పువ్వులు, ప్లాస్టిక్‌ పువ్వులు అస్సలు ఉండకూదని నిపుణులు అంటున్నారు. ఇవి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరగడానికి కారణమవుతుంది. అందుకే ప్లాస్టిక్‌ పూలను తీసేయాలి. సహజంగా ఉండే పువ్వులనే ఏర్పాటు చేసుకోవాలి.

* ఆర్థిక సమస్యలు దూరమై ఇంట్లో ప్రశాంతంత ఉండాలంటే కచ్చితంగా తులసి చెట్టును ఏర్పాటు చేసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఈశాన్యంలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవడంతో పాటు.. ప్రతీ రోజూ సాయంత్రం స్వచ్ఛమైన నెయ్యి దీపాన్ని వెలిగించాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..