Vastu Tips: మీ ఇల్లు వాస్తు ప్రకారమే ఉందా.? ఇవి చెక్‌ చేసుకోండి..

|

Sep 14, 2024 | 4:57 PM

కొత్తింటి నిర్మాణం మొదలు పెట్టాలనే ఆలోచన వచ్చిన వెంటనే ప్రతీ ఒక్కరూ చేసే పని వాస్తు నిపుణులను సంప్రదించడం. వాస్తు నియమాలకు అనుగుణంగానే ఇంటిని నిర్మిస్తుంటారు. అయితే మనలో చాలా మంది చిన్న చిన్న వాస్తు నియమాలను...

Vastu Tips: మీ ఇల్లు వాస్తు ప్రకారమే ఉందా.? ఇవి చెక్‌ చేసుకోండి..
Vastu Tips
Follow us on

కొత్తింటి నిర్మాణం మొదలు పెట్టాలనే ఆలోచన వచ్చిన వెంటనే ప్రతీ ఒక్కరూ చేసే పని వాస్తు నిపుణులను సంప్రదించడం. వాస్తు నియమాలకు అనుగుణంగానే ఇంటిని నిర్మిస్తుంటారు. అయితే మనలో చాలా మంది చిన్న చిన్న వాస్తు నియమాలను తెలిసో, తెలియకో వదిలేస్తుంటారు. వీటివల్ల ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరుగుతుంది. అందుకే ప్రతీ ఒక్కరూ కచ్చితంగా కొన్ని బేసిక్‌ వాస్తు నియమాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వాస్తు నిబంధనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇటీవల రూమ్‌ సీలింగ్‌ను అందంగా డిజైన్‌ చేసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే సీలింగ్‌ను డిజైన్‌ చేసుకునే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో ఐదు కార్నర్‌లు ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు.

* ఇక సింహద్వారా ఎదురుగా ఎట్టి పరిస్థితుల్లో మెట్లు లేకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సింహా ద్వారానికి ఎదురుగా మెట్లు ఉండడం వల్ల ఇంట్లో నెగిటివిటీ పెరిగే అవకాశం ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

* ఇక బేసిక్‌ వాస్తు నియమాల్లో ఈశాన్యం వైపు మెట్లు ఉండకూడదు. ఈశాన్యం కచ్చితంగా ఖాళీగా ఉండాలి. ఈ దిశలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. మరీ ముఖ్యంగా మెట్లు అస్సలు ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. మెట్లు తూర్పు నుంచి పడమరకు కానీ, ఉత్తరం నుంచి దక్షిణం వైపునకు కానీ ఎక్కేవిధంగా ఉండాలి. మెట్లు ఎల్లప్పుడూ బేసి సంఖ్యలో ఉండాలి.

* ఇక ఇంట్లో సింగిల్‌ మెయిన్‌ డోర్‌ ఏర్పాటు చేసుకుంటే.. అది కుడివైపు తెరుచుకునేలా ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల మంచి జరుగుతుంది.

* ఇక ఇంటికి వచ్చే అతిథితులు వాయువ్యం వైపు ఉన్న గదిలో ఉండేలా చూసుకోవాలి. అతిథితులు ఎల్లప్పుడూ వాయువ్యంలో నిర్మించిన గదిలోనే ఉండాలి.

* ఆగ్నేయంలో బెడ్‌ రూమ్‌ లేకుండా జాగ్రత్త పడాలి. ఆగ్నేయంలో వంటగది ఉండాలి. అలాంటి ప్రదేశంలో బెడ్‌ రూమ్ ఉండడం వ్ల నిత్యం గొడవలు జరిగే ప్రమాదం ఉంటుంది.

* ఇంట్లో రెండు ద్వారాలు ఎదురెదురుగా ఉంటే కచ్చితంగా అవి రెండు సమానంగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి.

* ఇంటికి ఉత్తరం, తూర్పు దిశలు మూతపడకకుండా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇంట్లో కిటికీలు బయటకు తెరుచుకునేలా ఉండాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..