Chicken: ఓహో.. కోడి పొద్దునే కూయడానికి కారణం ఇదేనా..

|

Oct 31, 2024 | 4:47 PM

ఉదయాన్నే కోడి కూత వినిపించడం సర్వసాధారణమైన విషయం. ఒకప్పుడు కోడి కూత ఆధారంగానే నిద్రలేచే వారు. అయితే కోళ్లు ఇతర సమయాలతో పోల్చితే ఉదయాన్నే ఎక్కువగా కూస్తుంటాయి. ఇంతకీ కోళ్లు ఉదయాన్నే కూయడం వెనకాల ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Chicken: ఓహో.. కోడి పొద్దునే కూయడానికి కారణం ఇదేనా..
Chicken
Follow us on

ఇప్పుడైతే ఉదయం నిద్రలేవడానికి వాచ్‌లో అలారం సెట్‌ చేసుకుంటున్నాం. కానీ ఒకప్పుడు మాత్రం కోడి కూత ఆధారంగా నిద్రలేచే వారు. ఆరు నూరైన కోడి ఉదయాన్నే పెద్దగా కూత పెడుతుంది. ఒకప్పుడు ఇల్ల చుట్టూ కోళ్లు ఎక్కువా ఉండేవి. దీంతో చాలా మంది కోడి కూత పెట్టగానే నిద్రలేచే వారు. కానీ ఇప్పుడు కోళ్లు అంతలా కనిపించడం లేదు. అంత ఉదయాన్నే నిద్రలేచే వారి సంఖ్య కూడా తగ్గింది.

అయితే కోడి పొద్దుననే ఎందుకు కూత పెడుతుంది. రోజులో ఇతర సమయాలతో పోల్చితే ఉదయాన్నే ఎక్కువగా కూత పడుతుంది. ఇంతకీ దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మనుషుల్లో ఉన్నట్లే కోళ్లలో కూడా జీవ గడియారం ఉంటుంది. దీనిని సిర్కాడియన్ రిథమ్ అంటారు. ఈ గడియారం కోళ్ల శరీరం 24 గంటల చక్రంలో పని చేయమని చెబుతుంది. సూర్యోదయం సమయంలో కాంతిలో మార్పు కారణంగా, ఈ గడియారం చురుగ్గా మారుతుంది.

ఇది వెంటనే కోడికి సంకేతం ఇస్తుంది. అదే విధంగా చాలా సున్నితంగా ఉండే కోడి కళ్లు.. ఉదయాన్నే కాంతిలో వచ్చే మార్పును ఇట్టే పసిగడతాయి. దీంతో కోళ్లు కూత పెడుతుంటాయని చెబుతుంటారు. అయితే కోళ్లు తమ చుట్టూ ఉన్న వాటిని అలర్ట్ చేయడానికి కూడా ఇలా కూత పెడుతుంటాయని చెబుతున్నారు. తమ ప్రాంతంలో ఉన్న ఇతర కోళ్లను కూయడం ద్వారా హెచ్చరిస్తాయని అంటున్నారు. ఇదండీ కోడి పొద్దున్నే కూత పెట్టడం వెనకాల ఉన్న అర్థం.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..