Fact: ప్రయాణ సమయంలో పైలట్స్‌.. పర్ఫ్యూమ్‌ వాడడం నిషేధం.. ఎందుకో తెలుసా?

|

Oct 18, 2024 | 12:41 PM

విమాన ప్రయాణానికి సంబంధించి ఎన్నో నిబంధనలను అధికారులు అమలు చేస్తుంటారు. ప్రమాదాలను నివారించేందుకు కొన్ని కఠిన నిబంధనలను అమలు చేస్తుంటారు. అలాంటి ఒక నిబంధన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విమాన ప్రయాణ సమయంలో పైలట్స్ పర్ఫ్యూమ్ ను ఉపయోగించకూడదని మీకు తెలుసా.?

Fact: ప్రయాణ సమయంలో పైలట్స్‌.. పర్ఫ్యూమ్‌ వాడడం నిషేధం.. ఎందుకో తెలుసా?
Flight Pilot
Follow us on

విమాన ప్రయాణానికి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. కొన్ని వందల మందిని, భూమి నుంచి ఎంతో ఎత్తులో సురక్షితంగా గమ్యానికి చేర్చే విమానాలను ఆపరేట్ చేసే విధానం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇక విమానాల ఆపరేటింగ్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు.

వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తారు. ఇందుకోసం కొన్ని నిబంధనలు అత్యంత కఠినంగా అమలు చేస్తుంటారు. అలాంటి వాటిలో ఒకటి పైలట్స్ పెర్ఫ్యూమ్‌ను ఉపయోగించకూడదు. అవును నిజమే విమానంలో పనిచేసే పైలెట్స్‌ ఎట్టి పరిస్థితుల్లో పర్ఫ్యూమ్‌ను వేసుకోరు. దీని వెనకాల అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

విమానాన్ని నడిపించే సమయంలో పైలట్స్‌ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. కానీ ఈ సమయంలో బలమైన సువాసనలు వారి దృష్టిని మార్చే అవకాశం ఉంటుంది. దీంతో ప్రయాణం ప్రమాదంగా మారే అవకాశాలు ఉంటాయి. ఇక విమాన ప్రయాణికి ముందు పైలెట్స్‌కు ఆల్కహాల్‌ పరీక్ష నిర్వహిస్తారు. అయితే పెర్ఫ్యూమ్‌ తయారీలో ఆల్కహాల్‌ ఉంటుంది. దీంతో ఇది ఆల్కహాల్‌ టెస్ట్‌ ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. అందుకే పైలట్స్‌ పర్ఫ్యూమ్‌ ఉపయోగించకూడదు.

కేవలం పర్ఫ్యూమ్‌ మాత్రమే కాకుండా.. మౌత్ వాష్‌ను కూడా ఉపయోగించకూడదు. ప్రయాణానికి ముందు మౌత్‌ వాష్‌ను ఉపయోగిస్తే బ్రీత్ ఎనలైజర్‌ పరీక్షను ప్రభావితం చేస్తుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పైలట్లతో పాటు సిబ్బంది ఇలాంటి వస్తువులను ఉపయోగించకూడదని చెబుతోంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..