Vastu Tips: ఇవి చేస్తే చాలు.. ఎలాంటి వాస్తు దోషాలైనా పరార్‌ అవ్వాల్సిందే..

|

Oct 27, 2024 | 10:43 AM

వాస్తుకు అనుగుణంగా ఇంటి నిర్మాణం ఉండాలని ప్రతీ కోరుకుంటారు. అయితే తెలిసో తెలియకో కొన్ని రకాల వాస్తు మిస్టేక్స్ జరుగుతుంటాయి. అలాంటి వాస్తు దోషాలకు చెక్ పెట్టాలంటే కొన్ని రకాల చిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వాస్తు చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Vastu Tips: ఇవి చేస్తే చాలు.. ఎలాంటి వాస్తు దోషాలైనా పరార్‌ అవ్వాల్సిందే..
Vastu
Follow us on

వాస్తుకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా భారతీయులను, వాస్తును విడదీసి చూడలేం. ఇంటి నిర్మాణం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. వాస్తుకు అనుకూలంగా ఇంటిని నిర్మించుకోవాలని కోరుకుంటారు. అయితే ఇంటిని ఎంత పకడ్బందీగా నిర్మించుకున్నా తెలిసో తెలియకో కొన్ని చిన్న చిన్న వాస్తు దోషాలు ఉండే ఉంటాయి. అలాంటి వాస్తు దోషాలు తొలగిపోవాలంటే కొన్ని రకాల పనులు కచ్చితంగా చేయాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మనలో చాలా మంది ఇంట్లో ఉపయోగం లేని వస్తువులను పెట్టుకుంటుంటారు. అయితే దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో అవసరం లేని వస్తువులను బయటపడేలాయని సూచిస్తున్నారు. ముఖ్యంగా పనికిరాని ఇనుము వస్తువులు నెగిటివ్‌ ఎనర్జీ పెరగడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. అందుకే అలాంటి వాటి స్టోర్‌ రూమ్‌లో కూడా ఉంచుకోకూడదుని చెబుతున్నారు.

ఇక ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉండకూడదంటే ఇంటిని కచ్చితంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో వస్తువులను చెల్లాచెదురుగా పడేయడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరిగి, ఇబ్బందులకు దారి తీస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు దారి తీస్తుందని అంటున్నారు. అలాగే ఇంట్లో మొక్కలు పెంచుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండిన మొక్కలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరగడానికి దారి తీస్తుందని అంటున్నారు.

లివింగ్ రూమ్‌ను వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. గదిలో నిత్యం మంచి సువాసన వచ్చే పర్‌ఫ్యూమ్స్‌ను పెట్టుకోవాలి. లేదాంటే అగర్ బత్తిలను ఉపయోగించాలి. ఇలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే ఆలోచనలు కూడా ప్రశాంతంగా ఉంటాయి. నెగిటివ్‌ ఎనర్జీ దూరమవుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య బంధాలు కూడా మెరుగువుతాయని పండితులు చెబుతుంటారు. ఇక ఇంట్లో తలుపులు లేదా కిటికీలు తెరుస్తున్న సమయంలో సౌండ్ రాకుండా చూసుకోవాలి. ఇది కూడా వాస్తు ప్రకారం మంచిదికాదని అంటున్నారు. ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి…