Vastu: ఇంట్లో టీవీ ఎక్కడ ఉండాలి.? కరెక్ట్ దిశ ఏంటో తెలుసా.?

|

Sep 20, 2024 | 1:51 PM

మనలో దాదాపు ప్రతీ ఒక్కరూ ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకుంటారు. అందుకే ఇంటి నిర్మాణం మొదలు పెట్టగానే తొలుత వాస్తు పండితులను సంప్రదిస్తారు. వాస్తుకు అనుగుణంగానే ఇటిని నిర్మిస్తుంటారు. అయితే వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువులకు కూడా వర్తిస్తుందని వాస్తు పండితులు చెబుతుంటారు. ఇలా ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఏ వస్తువులు ఏ దిశలో ఉండాలి.? కొన్ని వాస్తు […]

Vastu: ఇంట్లో టీవీ ఎక్కడ ఉండాలి.? కరెక్ట్ దిశ ఏంటో తెలుసా.?
Vastu Tips
Follow us on

మనలో దాదాపు ప్రతీ ఒక్కరూ ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకుంటారు. అందుకే ఇంటి నిర్మాణం మొదలు పెట్టగానే తొలుత వాస్తు పండితులను సంప్రదిస్తారు. వాస్తుకు అనుగుణంగానే ఇటిని నిర్మిస్తుంటారు. అయితే వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువులకు కూడా వర్తిస్తుందని వాస్తు పండితులు చెబుతుంటారు. ఇలా ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఏ వస్తువులు ఏ దిశలో ఉండాలి.? కొన్ని వాస్తు నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* బెడ్‌రూమ్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లోకి గాలి నైరుతి దిశ నుంచి వచ్చేలా చూసుకోవాలి. అంటే బెడ్‌రూమ్‌లో కిటికీలను దక్షిణ, పడమర మూలల్లో ఉండేలా చూసుకుంటే ఎలాంటి వాస్తు దోషాలు ఉండవు.

* ఇంటి మెయిన్‌ డోర్‌కు ఎదురుగా ఎట్టి పరిస్థితుల్లో లిఫ్‌ లేకుడా చూసుకోవాలి. దీనివల్ల నెగిటివ్‌ ఎనర్జీ పెరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసే వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వాస్తు పండితులు చెబుతున్నారు.

* ఇక ప్రతీ ఒక్కరి ఇంట్లో కచ్చితంగా టీవీ కచ్చితంగా ఉంటుంది. లివింగ్ రూమ్‌లో టీవీ ఉగ్నేయ దిశలో ఉండేలా చూసుకోవాలి. పొరపాటున కూడా టీవీలను నైరుతి లేదా ఈశాన్యం దిశలో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

* వంట గదిలో ఎట్టి పరిస్థితుల్లో అద్దాలు లేకుండా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగి ఆర్థిక ఇబ్బందులు తప్పవని అంటున్నారు. బెడ్‌రూమ్‌లో కూడా అద్దాలు ఉండకూడదు. ముఖ్యంగా బెడ్‌ అద్దంలో కనిపించకూడదని సూచిస్తున్నారు.

* ఆఫీస్‌ లేదా వ్యాపార స్థలాల్లో ఏర్పాటు చేసుకునే కంప్యూటర్‌ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు కుడివైపు కంప్యూటర్ ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

* హాల్‌లో దక్షిణ గోడకు ఉదయిస్తున్న సూర్యుడి వాల్ పోస్టర్‌ను పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.

* ఇక ఆఫీసుల్లో లేదా వ్యాపార స్థలంలో మీరు కూర్చున్న స్థలం వెనకాల కొండలు, పర్వతాలు ఉండే వాల్‌పేపర్లను అతికించాలి. దీనివల్ల వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో విజయవంతమవుతారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..