Astrology: స్నానం చేసిన వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా.? శాస్త్రం ఏం చెబుతోందంటే..

|

Oct 19, 2024 | 12:46 PM

హిందు ధర్మంలో ప్రతీ విషయానికి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి. వీటిలో స్నానం ఒకటి. స్నానం విషయంలో కొన్ని రకాల తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏంటా తప్పులు.? దానివల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Astrology: స్నానం చేసిన వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా.? శాస్త్రం ఏం చెబుతోందంటే..
Bathing
Follow us on

హిందూ ధర్మంలో ఎన్నో సంప్రదాయలు ఉన్నాయి. వీటన్నింటికీ ఒక అర్థం ఉంటుంది. మంచి జీవన విధానం కోసం మన పూర్వీకులు ఇందుకోసమే మనకు కొన్ని పద్ధతులను వివరించారు. ఈ నియమాలను పాటించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు. అలాంటి ఒక నియమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేయకూడదని చెబుతున్నారు. ఇంతకీ ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* మనలో చాలా మంది స్నానం చేసిన తర్వా బకెట్లో మిగిలిన నీటిని చివరికి కాళ్లపై పోసుకుంటారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల నెగిటివ్‌ ఎనర్జీ పెరుగుతుందని అంటున్నారు.

* మహిళలు తల స్నానం చేసిన వెంటనే బొట్టు పెట్టుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వెంట్రుకలు పూర్తిగా ఆరిన తర్వాతే మహిళలు బొట్టు పెట్టుకోవాలని పండితులు అంటున్నారు. లేకపోతే గ్రహాల అనుగ్రహం లభించదని అంటున్నారు.

* బాత్‌రూమలో బకెట్‌ ఖాళీగా ఉండకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు బకెట్‌లో ఎంతో కొంత నీరు ఉండే చూసుకోవాలి. లేదంటే.. బకెట్‌ను బోర్లించి ఉండాలని సూచిస్తున్నారు. ఖాళీ బకెట్ ఉంచడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

* స్నానం చేసిన వెంటనే గోర్లను కత్తిరించుకోవడం ఏమాత్రం మంచి అలవాటు కాదని నిపుణులు అంటున్నారు. దీనివల్ల దురదృష్టం వెంటాడుతుందని అంటున్నారు.

* తిన్న వెంటనే స్నానం చేయకూడదని శాస్త్రం చెబుతోంది. భోజనం చేసి తర్వాత కనీసం 48 నిమిషాల తర్వాతే స్నానం చేయాలని నిపుణులు అంటున్నారు. వైద్య పరంగా కూడా తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

* ఇక స్నానం గదిని వీలైనంత వరకు శుశ్రంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. షాంపూ ప్యాకెట్లను, డబ్బాలను అలాగే పడేయకూడదు. అలాగే తడి వస్త్రాలను బాత్‌రూమ్‌లో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. స్నానం చేసే గది శుభ్రంగా లేకపోతే నెగిటివ్‌ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు, శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..