Viral Video: బిడ్డ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన తల్లి.. చిటారు కొమ్మలో చిక్కుకున్న పిల్ల కోసం..!

Edited By:

Updated on: Mar 13, 2026 | 10:30 AM

అమ్మ ప్రేమకు హద్దులు ఉండవు అంటారు. అది మనుషులకే కాదు.. మూగజీవాలు.. జంతువుల్లో కూడా కనిపిస్తుంది. తాజాగా జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన చూస్తే నిజంగా అమ్మతనం ఎంత గొప్పదో అర్థమవుతుంది. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ శివారులో ఓ ఎండిపోయిన చెట్టుపై ఉడత తల్లి తన బిడ్డతో కలిసి ఉంది. ఆడుకుంటూ ఉండగా చిన్న ఉడత అనుకోకుండా సన్నని కొమ్మపైకి వెళ్లింది.

అమ్మ ప్రేమకు హద్దులు ఉండవు అంటారు. అది మనుషులకే కాదు.. మూగజీవాలు.. జంతువుల్లో కూడా కనిపిస్తుంది. తాజాగా జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన చూస్తే నిజంగా అమ్మతనం ఎంత గొప్పదో అర్థమవుతుంది. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ శివారులో ఓ ఎండిపోయిన చెట్టుపై ఉడత తల్లి తన బిడ్డతో కలిసి ఉంది. ఆడుకుంటూ ఉండగా చిన్న ఉడత అనుకోకుండా సన్నని కొమ్మపైకి వెళ్లింది. అయితే ఆ కొమ్మ ముందుకు దారి లేక ప్రమాదకరంగా మారింది. ఇది గమనించిన తల్లి ఉడత.. తన బిడ్డను కాపాడేందుకు ఆ దిశగా వెళ్లే ప్రయత్నం చేసింది. కానీ కొమ్మ చాలా సన్నగా ఉండటంతో విరిగిపోయే ప్రమాదం ఉండటంతో కాసేపు వెనక్కి వచ్చింది. అయితే తన బిడ్డ ప్రమాదంలో ఉందని భావించిన తల్లి ఉడత.. ధైర్యంగా ముందుకు దూకి చిన్న ఉడతను ఎత్తుకుని సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లింది. ఈ అరుదైన దృశ్యాలు అక్కడున్న వారిని కూడా భావోద్వేగానికి గురి చేశాయి. తల్లి ప్రేమకు ఇది మరో ఉదాహరణగా నిలిచింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Mar 13, 2026 10:30 AM
Follow Us