Devineni Vs Kodali Live Updates: కృష్ణా జిల్లా గొల్లపూడిలో టెన్షన్..టెన్షన్.. దేవినేని ఉమా అరెస్ట్.. సవాళ్లు, ప్రతిసవాళ్లు

|

Updated on: Jan 19, 2021 | 1:33 PM

కృష్ణా జిల్లా గొల్లపూడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకుంది.  గొల్లపూడి సెంటర్‌కు పలువురు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు చేరుకోవడంతో హైటెన్షన్ నెలకుంది.   టీడీపీ, వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. 

Devineni Vs Kodali Live Updates: కృష్ణా జిల్లా గొల్లపూడిలో టెన్షన్..టెన్షన్.. దేవినేని ఉమా అరెస్ట్.. సవాళ్లు, ప్రతిసవాళ్లు

కృష్ణా జిల్లా గొల్లపూడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకుంది.  గొల్లపూడి సెంటర్‌కు పలువురు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు చేరుకోవడంతో హైటెన్షన్ నెలకుంది.  టీడీపీ, వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.  గందరగోళం మధ్య ఎన్టీఆర్ విగ్రహం వద్ద దేవినేని ఉమ బైఠాయించారు. వెంటనే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా దీక్ష చేస్తానని దేవినేని ఉమా ప్రకటించిన విషయం తెలిసిందే.  ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు దీక్ష చేయాలని దేవినేని ఉమ నిర్ణయించారు.  దేవినేని ఇంటి వద్దకు రాకుండా కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు.  ఇంటికి వెళ్లే మార్గాల వద్ద బారికేడ్లు పెట్టిన పోలీసులు ఎవర్నీ అనుమతించడంలేదు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 19 Jan 2021 01:25 PM (IST)

    సీఎం జగన్‌ ప్రోద్బలంతోనే దాడులు: చంద్రబాబు

    ప్రజల పక్షాన మాట్లాడితే దాడులు చేస్తారా? అని టీడీపీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు జగన్ సర్కార్‌పై మండిపడ్డారు. ముఖ్యమంత్రి ‌ కనుసన్నల్లోనే దాడులు జరుగుతున్నాయని.. ఇలాంటి వాటిని సహించేది లేదని లేత్చిచెప్పారు. ప్రజల పక్షాన మాట్లాడిన సీనియర్‌ నేత దేవినేని ఉమాను అరెస్టు చేయడమేంటని సీరియస్ అయ్యారు. ఉమాతో పాటు ఇతర నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దేవినేని ఉమాపై భౌతిక దాడికి దిగుతానన్న మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు.

  • 19 Jan 2021 12:50 PM (IST)

    దేవినేని ఉమ అరెస్టుపై భగ్గుమన్న అచ్చెన్న

    శాంతియుతంగా నిరసన తెలుపుతున్న దేవినేని ఉమాను పోలీసులు అరెస్టు చేయటాన్ని టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రశాంతంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తానన్న ఉమాను పోలీసులు ఎందుకు ఆధీనంలోకి తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.  రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించడం ప్రభుత్వానికి చేతకావడం లేదని ఆరోపించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కొడాలి నాని జనం ముందుకు వస్తే తగ్గిన బుద్ధి చెప్తారని చెప్పారు. అభివృద్ధి మీద చర్చకు రమ్మంటే వ్యక్తిగత విమర్శలు చేయడం దిగజారుడుతనమన్నారు.

  • 19 Jan 2021 12:22 PM (IST)

    ఒక్కడి కోసం వేలమంది పోలీసులను పంపిస్తావా? : దేవినేని ఉమా

    మంత్రి కొడాలి వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడిలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కూర్చుంటా అంటే ఎందుకంత భయమని దేవినేని ఉమా సీఎం జగన్‌ను ప్రశ్నించారు.  టచ్ చేస్తామని సవాల్ చేసి ఒక్కడికోసం వేలమంది పోలీసులను పంపిస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రభుత్వ నియంతృత్వ పాలనకు ప్రజలు భయపడరని.. ప్రజాబలాన్ని అధికార దుర్వినియోగంతో అడ్డుకోలేరని దేవినేని ఉమా ట్వీట్‌లో పేర్కొన్నారు.

  • 19 Jan 2021 12:02 PM (IST)

    ప్లేస్ డిసైడ్ చెయ్.. వస్తా: ఉమాకు నాని మరోసారి సవాల్

    చర్చపై మరోసారి క్లారిటీ ఇచ్చారు మంత్రి కొడాలి నాని. తాను సింగిల్‌గా వస్తానని, ఇద్దరమే మాట్లాడుకుందాం ప్లేస్ డిసైడ్ చెయ్యమని ఉమాకు సూచించారు నాని. అప్పుడు అన్ని సంగతలు తేలుతాయన్నారు. పోనీ ఏ టీవీ ఛానల్‌లో అయినా చర్చకు సిద్దమన్నారు.  వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో పట్టుకుని తాను వస్తానని, టీడీపీ మేనిఫెస్టో పట్టుకుని ఉమా రావాలని కోరారు. సీఎం జగన్‌ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే.. టీవీ డిబెట్ అని కూడా చూడనని చెప్పారు.

  • 19 Jan 2021 11:36 AM (IST)

    దేవినేని ఉమను ఏ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు..?

    ఇక దేవినేని ఉమను పోలీసులు ఎక్కడికి తరలించారు అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. మాములుగా ఇటువంటి సందర్బాల్లో పీఎస్‌కు తరలిస్తే కార్యకర్తలతో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి.. పరిస్థితి సద్దుమణిగే వరకు అలా వాహనాల్లో తిప్పుతూ ఉంటారు పోలీసులు. మరోవైపు ఆయన ఫోన్‌లో అందుబాటులోకి తీసుకునేందుకు ప్రయత్నించింది టీవీ9. కానీ ఎటువంటి సమాధానం రాలేదు.

  • 19 Jan 2021 11:21 AM (IST)

    టీవీ9 వేదికగా చర్చకు సిద్దం : వల్లభనేని వంశీ

    గతంలో టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందకు ఇచ్చిన హామీలు...వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలపై చర్చకు సిద్దమని కోడాలి నాని సవాల్ విసిరితే.. రోడ్డుపై ఉమా లా అండ్ ఆర్డర్ ప్లాబ్లం క్రియేట్ చేస్తున్నారని వల్లభనేని ఆరోపించారు. ఒక వేదికపై కాకుండా.. నడిరోడ్డుపై ఈ రచ్చ ఏంటని ప్రశ్నించారు.  "టచ్ చేసి చూడు" సినిమాకు తాను, కొడాలి నాని నిర్మాతలమని..తమ సినిమా డైలాగులను దేవినేని ఉమా కాపీ కొడుతున్నారని చమత్కరించారు. పోలవరంలో 100 కోట్లు వెనకేసుకుంది, కాలవలు తవ్వకుండా బిల్లులు చేసుకుందో ఎవరో సరిగ్గా చర్చిస్తే తేలుతుందన్నారు. టీవీ9 వేదికగా చర్చ ఏర్పాటు చేస్తే..తాను కొడాలి నాని వస్తామని..మరోసారి దేవినాని ఉమాకు సవాల్ విసిరారు వల్లభనేని వంశీ

  • 19 Jan 2021 11:08 AM (IST)

    గొల్లపూడి చేరుకున్న వల్లభనేని వంశీ

    మరోవైపు ఆందోళనల మధ్య గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గొల్లపూడి చేరుకున్నారు. వైసీపీ కార్యకర్తలు ఆయనకు పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. వంశీ అక్కడి పరిస్థితిని నానికి ఫోన్ ద్వారా చేరవేసినట్లు తెలుస్తోంది.

  • 19 Jan 2021 10:48 AM (IST)

    అసలు ఏం జరిగిందంటే..?

    సోమవారం ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి కొడాలి నాని గొల్లపూడిలో దేవినేని ఉమను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ గురించి మాట్లాడితే తన చేతిలో దెబ్బలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉమ.. ఎన్టీఆర్ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. ఆపడానికి ఎవరు వస్తారో చూస్తానంటూ సవాల్ విసిరారు. అయితే దేవినేని ఉమ నిరసనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన దీక్ష చేసేందుకు వెళ్లడంతో.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • 19 Jan 2021 10:41 AM (IST)

    దేవినేని ఉమా అరెస్ట్

    ముఖానికి మాస్క్ పెట్టుకుని పోలీసులు గమనించకుండా దేవినేని ఉమా ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. వెంటనే అలర్టైన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.  గొల్లపూడిలో 144 సెక్షన్, పోలీసు యాక్టు 30 అమల్లో ఉందని కృష్ణా జిల్లా పోలీసులు తెలిపారు. దేవినేని ఉమ నిరసనకు అనుమతి లేదని స్పష్టం చేశారు.  అందుకే ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు గొల్లపూడి వద్ద ఉద్రిక్తత కొనసాగుతుంది.

Published On - Jan 19,2021 1:25 PM

Follow us
Latest Articles