Gold seized: మంగళూరు విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత.. ఇద్దరిని అరెస్టు చేసిన కస్టమ్స్‌ అధికారులు

Gold seized: బంగారం అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం ఆగడం లేదు. కిలోల కొద్ది బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా ..

Gold seized: మంగళూరు విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత.. ఇద్దరిని అరెస్టు చేసిన కస్టమ్స్‌ అధికారులు
Follow us

|

Updated on: Jan 15, 2021 | 6:40 PM

Gold seized: బంగారం అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం ఆగడం లేదు. కిలోల కొద్ది బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు స్మగ్లర్లు. తాజాగా కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు స్మగ్లర్ల నుంచి కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫైజల్‌ థొట్టి మేల్పరంబ, షోహెబ్‌ ముగు అనే ఇద్దరు వ్యక్తులు షార్జా నుంచి ఎయిరిండియా విమానంలో వచ్చి ఎయిర్‌ పోర్టులో దిగారు. అయితే ఇంటెలిజెన్స్‌ సమాచారం ప్రకారం.. అప్పటికే వీరి కదలికలపై కస్టమ్స్‌ అధికారులు నిఘా పెట్టారు.

విమానాశ్రయంలో దిగగానే ఇద్దరు సామాగ్రిని తనిఖీ చేయగా 2 కిలోల 15 గ్రాముల బంగారం బయట పడింది. దీంతో కస్టమ్స్‌ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. కోటి 9 లక్షల విలువు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. ఇలా ప్రతి రోజు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భారీ మొత్తంలో బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతుండటంతో అధికారులు ప్రత్యేక నిఘా పెంచారు. విమానాశ్రయంలో దిగిన ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కొందరైతే కొత్త కొత్త ఐడియాలతో షూస్‌లలో, కడుపుల్లో, ఇతర సామాగ్రిల్లో రహస్యంగా బంగారాన్ని దాచి రవాణా చేస్తూ  కస్టమ్స్‌ అధికారులకు అడ్డంగా దొరికిపోతున్నారు.

Also Read: మరోసారి కేరళ ఎయిర్‌పోర్టులో అక్రమ బంగారం.. ప్రయాణికుడు తరలిస్తున్న తీరు చూసి ఖంగుతిన్న అధికారులు..!