Women Health: పీరియడ్స్ సమయంలో తట్టుకోలేని పెయిన్ వస్తుందా? ఇది తింటే పెయిన్ రాదంటున్న వైద్యులు..

|

Nov 09, 2022 | 7:10 AM

చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. ఈ నొప్పిని పీరియడ్స్ క్రాంప్ అంటారు. పీరియడ్స్ సమయంలో చాలామంది..

Women Health: పీరియడ్స్ సమయంలో తట్టుకోలేని పెయిన్ వస్తుందా? ఇది తింటే పెయిన్ రాదంటున్న వైద్యులు..
Period Cramp
Follow us on

చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. ఈ నొప్పిని పీరియడ్స్ క్రాంప్ అంటారు. పీరియడ్స్ సమయంలో చాలామంది మహిళలు పొత్తికడుపులోనే కాదు, వెన్ను, కాళ్లలో కూడా భరించలేని నొప్పిని అనుభవిస్తారు. కొంతమంది ఆ పెయిన్ తట్టుకోలేక మందులను వాడుతారు. గర్భాశయంలో సంభవించే సంకోచాల కారణంగా ఈ నొప్పి వస్తుంది. దీని కారణంగా మహిళలు ఆందోళన చెందుతారు. అయితే, కొన్ని సాధారణ పద్ధతులతో ఈ నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ దీపాలి భరద్వాజ్ తన ‘సెయిల్ ఆల్ ఓవర్ యువర్ మెన్‌స్ట్రువల్ వర్రీస్’ పుస్తకంలో పీరియడ్స్ సమస్య, చికిత్స గురించి చెప్పారు. అందులో పీరియడ్స్ క్రాంప్స్ కూడా ఒకటి. పీరియడ్స్ నొప్పి నుండి ఉపశమనాన్ని అందించే సింపుల్ హోం రెమెడీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పీరియడ్స్ సమయంలో పెరుగు తినకూడదని పెద్దల కాలం నుంచి చెబుతూ వస్తున్నారు. అయితే, పెరుగులో అరటి పువ్వులను కలిపి తీసుకుంటే అద్భుత ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు డాక్టర్ దీపాలి. దీన్ని సరైన పదార్థాలతో తీసుకుంటే సర్వరోగ నివారణిగా పని చేస్తుందన్నారు. అరటి పువ్వును ఉడికించి, పెరుగుతో కలిపి తింటే పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయని పేర్కొన్నారు.

ఆస్పిరిన్..

డాక్టర్ దీపాలి ప్రకారం.. రెండు మాత్రల ఆస్పిరిన్, అర టీస్పూన్ చక్కెర, అర టీస్పూన్ తేనెను అర గ్లాసు నీటిలో కలిపి తీసుకోవడం వల్ల పీరియడ్స్ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

కుసుమ ప్రయోజనం..

కుసుమ పువ్వు అద్భుతంగా పని చేస్తుంది. ఇది పీరియడ్స్ చికిత్సలో చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. దీని పొడిని నీళ్లలో వేసి తాగడం వల్ల నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

పండ్లు కూడా ప్రయోజనకరంగా..

ఇవి కాకుండా.. అనేక పండ్లు కూడా పీరియడ్స్ క్రాంప్స్ నుండి ఉపశమనం ఇస్తాయి. బొప్పాయి, అరటిపండు, నారింజ వంటి పండ్లను రోజూ డైట్‌లో చేర్చుకోవడం వల్ల పీరియడ్స్ పెయిన్‌లో రిలీఫ్‌తో పాటు మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

నువ్వులు..

గోరువెచ్చని నీటితో రోజుకు రెండుసార్లు నువ్వులు తింటే పీరియడ్స్ నొప్పి తగ్గుతుంది. నువ్వుల ప్రభావం వేడిగా ఉంటుంది. దీని కారణంగా రక్తస్రావం బాగా జరుగుతుంది.

దాల్చిన చెక్క..

గోరువెచ్చని పాలలో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి తాగితే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పీరియడ్స్ సమయంలో రోజూ ఈ పాలను తీసుకోవడం వల్ల మంచి నిద్ర కూడా వస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..