విటమిన్ల లోపం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైన సమస్యగా మారింది. శరీరంలో అవసరమైన విటమిన్లు లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, విటమిన్ లోపం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి శరీరానికి అన్ని రకాల విటమిన్లు అవసరం.. శరీర అభివృద్ధికి, ఆరోగ్యం కోసం ప్రతిరోజూ విటమిన్లు A, D, C, E, B6, B12లతో పాటు ఫోలేట్, జింక్, ఇనుము, రాగి, సెలీనియం వంటి మినరల్స్ కావాలి.. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలం అంటున్నారు వైద్య నిపుణులు.. విటమిన్ల లోపం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎలా వస్తాయి.. ? ఏ విటమిన్ లోపం వల్ల క్యాన్సర్ వస్తుంది.. ఇలాంటి విషయాలపై అవగాహనతో ఉండటం చాలా ముఖ్యం..
విటమిన్లు మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలు. వీటి లోపం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఏ విటమిన్ లోపం వల్ల ఏ సమస్య వస్తుంది.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
విటమిన్ ఎ: దృష్టి సమస్యలు, పొడి చర్మం కలిగిస్తుంది.
విటమిన్ B1: అలసట, బరువు తగ్గడం, నరాల సంబంధిత సమస్యలు ఏర్పడవచ్చు.
విటమిన్ B12: రక్తహీనత, నరాల సమస్యలు, చిత్తవైకల్యం కలిగించవచ్చు.
విటమిన్ సి: చిగుళ్ళలో రక్తస్రావం, నెమ్మదిగా గాయం నయం కావడం లేదా గాయం తగ్గకపోవడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుంది.
విటమిన్ డి: ఎముకలు బలహీనపడటం (ఆస్టియోపోరోసిస్), కండరాల నొప్పులకు కారణం కావచ్చు.
విటమిన్ ఇ: కండరాల బలహీనత, నరాల సంబంధిత సమస్యలకు కారణం కావచ్చు.
విటమిన్ K: రక్తం గడ్డకట్టే సమస్యలను కలిగిస్తుంది.
విటమిన్ లోపం నేరుగా క్యాన్సర్‌కు కారణమైనప్పటికీ, కొన్ని విటమిన్ లోపాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
విటమిన్లు మన శరీరం రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఈ వ్యవస్థ బలహీనమైతే, క్యాన్సర్ కణాలతో పోరాడే సామర్థ్యం తగ్గిపోతుంది. విటమిన్లు కణాలను రక్షించే యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు లేకపోతే, కణాలు దెబ్బతింటాయి.. క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. DNA నిర్మాణానికి, మరమ్మతులకు విటమిన్లు అవసరం. విటమిన్ లోపం DNA దెబ్బతింటుంది.. క్యాన్సర్ కణాలు ఏర్పడటానికి దారితీస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..