Winter Health: మీరు శాఖాహారులా? అయితే ఆ విటమిన్ లోపం వల్ల చర్మ సమస్యలు గ్యారెంటీ!

| Edited By: Ravi Kiran

Jan 15, 2023 | 7:00 AM

విటమిన్ బీ 12 కేంద్ర నాడీ వ్యవస్థ, అలాగే ఇతర శారీరక ప్రక్రియల సరైన పనితీరు కోసం సాయం చేస్తుంది. అలాగే శాకాహారులు ముఖ్యంగా విటమిన్ బీ 12 లోపంతో బాధపడతారు. అలాగే విటమిన్ బి 12 లోపాన్ని గుర్తించకపోవడంతో మరిన్ని సమస్యలు వస్తాయి.

Winter Health: మీరు శాఖాహారులా? అయితే ఆ విటమిన్ లోపం వల్ల చర్మ సమస్యలు గ్యారెంటీ!
Dry Skin
Follow us on

చలికాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల వివిధ సమస్యలకు గురవుతుంటాం. ముఖ్యంగా చర్మ సమస్యలు తరచూ వేధిస్తుంటాయి. అందులో ముఖ్యంగా విటమిన్ బి 12 లోపం వల్ల చాలా సమస్యలు వస్తుంటాయి. విటమిన్ బీ 12 కేంద్ర నాడీ వ్యవస్థ, అలాగే ఇతర శారీరక ప్రక్రియల సరైన పనితీరు కోసం సాయం చేస్తుంది. అలాగే శాకాహారులు ముఖ్యంగా విటమిన్ బీ 12 లోపంతో బాధపడతారు. అలాగే విటమిన్ బి 12 లోపాన్ని గుర్తించకపోవడంతో మరిన్ని సమస్యలు వస్తాయి. అలాగే విటమిన్ బి 12 లోపం వల్ల వచ్చే సమస్యలను వేరే వాటి వల్ల సంభవిస్తున్నాయని అనుకోవడం వల్ల మర్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. విటమిన్ బి 12 లోపం వల్ల అలసట, వికారం, ఉబ్బరం, మానసినక రుగ్మతలు వంటి సమస్యలు వస్తాయి. అలాగే ముఖ్యంగా విటమిన్ బి 12 లోపం వల్ల చర్మ సమస్యలు తరచూ వేధిస్తాయి. అందువల్ల చర్మ సమస్యలు కనిపించిన వెంటనే తగ జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. విటమిన్ బి 12 లోపం వల్ల ఎలాంటి చర్మ సమస్యలు వస్తాయో? తెలుసుకుందాం. 

చర్మం పాలిపోవడం

చర్మం పాలిపోవడం, లేదా పసుపుగా మారడం కామెర్ల లక్షణాలు అనుకోవచ్చు. ఈ సమస్య విటమిన్ బి 12 లోపం వల్ల కూడా సంభివిస్తుంది. విటమిన్ బి 12 వల్ల వచ్చే రక్తహీనత వల్ల చర్మం అసౌకర్యానికి గురై తరచూ పాలిపోయినట్టు అవుతుంది.

నోటిలో పుండ్లు

చిగుళ్లు, నాలుకపై తరచూ పుండ్లు పడితే విటమిన్ బి 12 లోపం కావచ్చు. రక్తహీనత కారణంగా నోట్లో పుండ్లు పడతాయని వైద్యులు చెబుతుంటారు. అయితే విటమిన్ బి 12 లోపం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. అందువల్ల ఈ విటమిన్ లోపం వల్ల నోటిలో పుండ్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మోకాళ్లు, మోచేతులు నల్లబడడం

విటమిన్ బి 12 లోపం హైపర్ పిగ్మెంటేషన్ కు కారణం అవుతుంది. దీని వల్ల మోకాళ్లు, మోచేతులు నల్లబడతాయి. అయితే అందరిలో ఈ లక్షణం సాధారణంగా కనిపించదు. 

పొడి బారడం, ముడతలు రావడం

విటమిన్ బి 12 లోపం వల్ల చర్మం పొడిబారడం అలాగే పొరలుగా ఊడిపోతుంది. అలాగే వృద్ధాప్య సమస్యలకు గురి చేస్తుంది. చర్మం ముడతలు రావడం ప్రారంభమవుతాయి. 

ఆరోగ్య నిపుణులు మాత్రం విటమిన్ బి 12 లోపం సమస్యలకు కారణమైన పెద్దగా బయపడాల్సిన పని లేదని భరోసా ఇస్తున్నారు. ట్యూనా ఫిష్, గుడ్లల్లో విటమిన్ బి 12 అధికంగా ఉంటుందని వాటిని తింటే మంచిదని సూచిస్తున్నారు. ఒకవేళ శాకాహారులైతే విటమిన్ బి 12 సప్లిమెంట్స్ కోసం వైద్యులను సంప్రదిస్తే మంచిది. 

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..