మీరు ఎప్పుడైనా జ్వరం ఆస్పత్రికి వెళ్లారా.. వైద్యుడు శరీర టెంపరేచర్ ఎంతుందో చూడడంతో పాటు తప్పనిసరిగా రక్తపోటు లేదా బీపీ చెక్ చేస్తారు. మన శరీర అవయవాలకు గుండె ధమనుల ద్వారా రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. ఈ రక్త ప్రవాహం ధమనులపై ఏర్పరిచే ప్రెజర్‌ను రక్తపోటు అంటారు. ధమనులు ఆరోగ్యంగా ఉంటే, వాటి ద్వారా రక్తం సులభంగా ప్రవహిస్తుంది. ఇందుకు గుండె ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. కానీ ధమనులు చాలా ఇరుకుగా మారి, కుంచించుకు పోయినప్పుడు లేదా గట్టిపడినప్పుడు రక్తపోటు పెరుగుతుంది. దీంతో రక్తాన్ని పంపింగ్ చేసేందుకు గుండె ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. సాధారణంగా బీపీని స్పిగ్మోమానోమీటర్ అనే పరికరంతో, మిల్లీమీటర్ల పాదరసం (mm Hg)లో కొలుస్తారు. దీన్ని సిస్టోలిక్ ప్రెజర్/డయాస్టోలిక్ ప్రెజర్‌గా సూచిస్తారు. వ్యక్తుల సాధారణ రక్తపోటు 120/80 mm Hg వరకు ఉంటుంది. దీని కన్నా ఎక్కువగా బీపీ నమోదువుతూ ఉంటే హై బీపీ అని.. తక్కువగా నమోదైతే లో బీపీ అని వైద్యులు చెబుతుంటారు. నిర్ణీత పరిధి కన్నా అధికంగా నమోదయ్యే హై బీపీలలో రకాలు.. వాటి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు చెబుతున్న వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రాథమిక రక్తపోటు.. ఇది శరీరంలో ఉన్నా కూడా పెద్దగా లక్షణాలు కనిపించవు. సాధారణంగా ఎప్పుడైనా ఆరోగ్యం బాగోనప్పుడు చెకప్ కి వెళ్లినప్పుడు లేదా కమ్యూనిటీ స్క్రీనింగ్ అప్పుడు దీనిని బయటపడుతుంది. దీనిని గుర్తించకపోవడం వల్ల స్థూలకాయం, డయాబెటిస్, పలు గుండె సంబంధిత వ్యాధులు చుట్టుముడతాయి. ప్రధానంగా 60 ఏళ్లు పై బడిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
సెకండరీ హైపర్ టెన్షన్.. హైపర్ టెన్షన్ కేసుల్లో 5 నుంచి 10 శాతం మందిలో ఈ సెకండరీ హైపర్ టెన్షన్ గమనిస్తుంటామని నిపుణులు చెబుతున్నారు. వీరిలో అకస్మాత్తుగా బీపీ పెరిగిపోతుంది. అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, రెనో వాస్కులర్ హైపర్ టెన్షన్ కిడ్నీ సంబంధిత రోగుల్లో ఇది కనిపిస్తుంది.
గర్భధారణ రక్తపోటు.. ఇది గర్భిణుల్లో కనిపించే రక్తపోటు. గర్భిణుల్లో రక్తపోటు అధికమైతే ప్రసూతి మరణం లేదా పిండంలో లోపాలను కలుగజేస్తుంది.
వైట్ కోట్ హైపర్ టెన్షన్.. దీనిని ఐసోలేటెడ్ క్లినిక్ హైపర్ టెన్షన్ అని కూడా పిలుస్తారు. అంటే ఆస్పత్రిలో లేదా కార్యాలయాల్లో అధిక రక్తపోటు ఉంటుంది. బయటకు వెళ్లగానే నార్మల్ అయిపోతుంది. కనీసం 20/10 ఎంఎంహెచ్ జీ ఎక్కువ ఉంటుంది. మన దేశంలో పెద్ద వారిలో కంటే యువతలోనే ఈ తరహా బీపీ ఎక్కువగా కనిపిస్తుంది.
రెసిస్టెంట్ హైపర్ టెన్షన్.. మందులు వాడినా అదుపులో లేని బీపీ ఉన్న వారిని రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ రోగులుగా నిర్ధారిస్తారు. వీరికి ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండదు. అలాంటి వారిలో కార్డియో వాస్కులర్ వ్యాధులు ప్రభలుతాయి. ఆర్గాన్ డ్యామేజ్ అయ్యి చివరికి ప్రాణాలు తీస్తాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..