Tea Side Effects: సాయంత్రం పూట టీ తాగుతున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే

|

Jan 02, 2023 | 11:12 AM

ముఖ్యంగా ఉదయం, సాయంత్రం టీ తాగందే ఏ పని మొదలు పెట్టరు. అయితే ఈ అలవాటు అంతమంచిది కాదంటున్నారు నిపుణులు. వారి అభిప్రాయం ప్రకారం, నిద్రించడానికి 10 గంటల ముందు కెఫీన్‌కు దూరంగా ఉండాలి.

Tea Side Effects: సాయంత్రం పూట టీ తాగుతున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే
Tea
Follow us on

మన దేశంలోని ప్రజలకు అత్యంత ఇష్టమైన పానీయాలలో టీ ఒకటి. ఇది లేకుండా చాలామందికి రోజు కూడా గడవదంటే అతిశయోక్తి కాదు. నిజం చెప్పాలంటే టీ అన్నది ఇప్పుడు ఓ ఎమోషన్‌గా మారిపోయింది. సంతోషకరమైన సందర్భం వచ్చినా, టెన్షన్, స్ట్రెస్ ఉన్నా కచ్చితంగా టీ చుక్క నోట్లో పడాల్సిందే. అలా మన జీవితాల్లో టీ ఒక భాగంగా మారిపోయింది. చాలామంది రోజూ గ్లాసుల కొద్దీ టీ లు లాగిస్తుంటారు. ఎక్కువగా టీ, కాఫీలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసినా ఈ అలవాటును మానుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం టీ తాగందే ఏ పని మొదలు పెట్టరు. అయితే ఈ అలవాటు అంతమంచిది కాదంటున్నారు నిపుణులు. వారి అభిప్రాయం ప్రకారం, నిద్రించడానికి 10 గంటల ముందు కెఫీన్‌కు దూరంగా ఉండాలి. ఇది ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో కార్టిసాల్‌ స్థాయులు తగ్గిపోతాయి. అలాగే జీర్ణప్రక్రియ కూడా మెరుగవుతుంది. మరి సాయంత్రం పూట టీ తాగడం వల్ల ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉన్నాయో తెలుసుకుందాం రండి.

సాయంత్రం పూట ఎవరు టీ తాగొచ్చంటే?

నైట్ షిఫ్ట్‌లలో పనిచేసే వారు సాయంత్రం టీ తాగొచ్చు. అలాగే అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు లేని వారు సాయంత్రం పూట టీ తాగవచ్చు. సంపూర్ణ జీర్ణశక్తి ఉన్నవారు, రోజూ సమయానికి ఆహారం తీసుకునే వారు, ఎలాంటి నిద్ర సమస్య లేని వారు సాయంత్రం ఎంచెక్కా టీని ఆస్వాదించవచ్చు.

ఇవి కూడా చదవండి

వీరు దూరంగా ఉండాలి..

నిద్ర సమస్యలు ఉన్నవారు సాయంత్రం టీ తాగడం మానుకోవాలి. అలాగే మలబద్ధకం, అసిడిటీ లేదా గ్యాస్ సమస్య ఉన్నవారు కూడా టీ తాగకూడదు. వీరితో పాటు బరువు తక్కువగా ఉన్నవారు, జుట్టు, చర్మం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. జీవక్రియ మరియు ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారు కూడా టీ తాగకూడదు. హార్మోన్ సమస్యలు ఉన్నవెంటనే ఈ అలవాటును మానుకోవాలి

రోజుకు ఎన్నిసార్లు టీ తాగొచ్చంటే?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజుకు ఒకటి నుండి రెండు కప్పుల టీ తాగొచ్చు. ఇంతకు మించి తాగితే మాత్రం ఆరోగ్యం డేంజర్‌లో పడినట్లే. మోతాదుకు మించి టీ తాగితే శరీరంలో డీహైడ్రేషన్ సమస్యలు కలుగుతాయి. ఎముకలు బలహీనపడతాయి. టీలోని మూలకాలు శరీరంలో ఉండే ఐరన్‌ స్థాయులను తగ్గిస్తాయి.

గ్రీన్ టీ బెటర్‌

పని ఒత్తిడి నుంచి అలసట, ఉపశమనం పొందేందుకు పాలతో టీకి బదులుగా గోరువెచ్చని టీ తాగండి. పడుకునే ముందు గ్రీన్ టీ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. పైగా ఈ టీతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి