Fitness Tips: మీరు జిమ్‌లో ఫిట్‌నెస్‌ కోసం ఇలా చేస్తున్నారా..? ప్రమాదమే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి!

| Edited By: Anil kumar poka

Apr 08, 2022 | 8:07 AM

Fitness Tips: ఇప్పుడున్న రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముందే కరోనా మహమ్మారి వల్ల చాలా మంది ఆనారోగ్యం బారిన పడి ఎన్నో ఇబ్బందులకు..

Fitness Tips: మీరు జిమ్‌లో ఫిట్‌నెస్‌ కోసం ఇలా చేస్తున్నారా..? ప్రమాదమే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి!
Follow us on

Fitness Tips: ఇప్పుడున్న రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముందే కరోనా మహమ్మారి వల్ల చాలా మంది ఆనారోగ్యం బారిన పడి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ఫిట్‌నెస్‌ (Fitness) కోసం అనేక కసరత్తులు చేస్తున్నారు. అయితే జిమ్‌ (Gym)లలో చేస్తున్న తప్పిదాలు వారి ప్రాణాలను వచ్చే అవకాశాలున్నాయి. జిమ్‌ చేస్తూ అలసిపోయి మెట్లమీద కూర్చున్న వారు నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలిపోయిన ఘటనలున్నాయి. జిమ్‌ చేసే సమయంలో జిమ్‌ సెంటర్లలో పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు జిమ్‌ నిపుణులు.

  1. జిమ్‌లలో వెంటిలేషన్‌..జిమ్‌ సెంటర్లలో వెంటిలేషన్‌ లేకుంటే జిమ్‌ చేయకూడదు. చిన్న చిన్న గదుల్లో వెయిట్‌ లిఫ్టింగ్‌, రిన్నింగ్‌, జాగింగ్‌ లాంటివి చేసినప్పుడు వదిలే గాలినే తిరిగి తీసుకోవాల్సి వస్తుంది. దీంతో రక్తంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ శాతం పెరుగుతుంది. అధిక తలనొప్పి రావడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.
  2. మంచి కోచ్‌ ఉన్న జిమ్‌లో చేరడం ఉత్తమం: బరువు తగ్గించుకోవడం, వెయిట్‌ గెయిన్‌ కోసం చాలా మంది జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇంకొంత మంది ఫిట్‌నెస్‌ కోసం వెళ్తున్నారు. ఉద్యోగులు, మహిళలు అధిక బరువు, థైరాయిడ్‌ లాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. అమ్మాయిలైతే నడుము చుట్టున్న కొవ్వును తగ్గించుకునేందుకు, యువకులైతే మజిల్స్‌, చెస్ట్‌ పెంచుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అందుకే ప్రత్యేక వ్యాయమాలు, ఫిట్‌గా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. జిమ్‌ జీవితంలో ఒక భాగమైపోయింది. థైరాయిడ్‌, అర్ధరైడ్‌తో బాధపడుతున్నవారు అధికంగా జిమ్‌లకు వస్తున్నారు. 50 ఏళ్లు పైబడిన వారు మోకాల నొప్పులు, బీపీ తగ్గించుకునేందుకు వ్యాయామంపై దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం సరైన శిక్షణ లేనివారు కూడా జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మంచి కోచ్‌ ఉన్న జిమ్‌లో చేరడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

  1. జిమ్‌లో సరైన వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవాలి.
  2. జిమ్‌ చేసేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మందులు వాడుతున్నవారు వైద్యుల సూచన మేరకు వ్యాయమం చేయాలి.
  3. ప్రతి జిమ్‌లో తప్పనిసరిగా మెడికల్‌ అడ్వైజర్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
  4. సామర్థ్యానికి మించి వ్యాయమం చేయకపోవడం మంచిది.
  5. జిమ్‌లలో ఒకే విధమైన వ్యాయమం చేయకుండా రకరకాలుగా చేయడం మంచిది.
  6. వ్యాయామం చేస్తున్న సమయంలో మాస్క్‌లు ధరించవద్దు.
  7. జిమ్‌ కోచ్‌ దగ్గరే వ్యాయామాలు నేర్చుకోవాలి.
  8. జిమ్‌లో అతిగా బరువున్న పరికరాలను ఎత్తకపోవడం మంచిది.
  9. వాటర్‌ బాటిల్‌, టవల్‌, లెమన్‌ వాటర్‌, కొబ్బరి వాటర్‌, ఓఆర్‌ఎస్‌ వెంట ఉంచుకోవడం మర్చిపోవద్దు.
  10. జిమ్‌ చేసిన తర్వాత పండ్లు, గుడ్డు తీసుకుంటే ఒంటి, కండరాల నొప్పులు రావు.
  11. వ్యాయామాలు చేసే ముందు జిమ్‌లో కోచ్‌ సలహాలు, సూచనలు తీసుకోవడం తప్పనిసరి.

(గమనిక: ఈ వివరాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇందులోని అంశాలు జిమ్‌ నిపుణుల సూచనలు, సలహాల మేరకు అందించడం జరుగుతుంది. జిమ్‌ చేసే వారు ముందుగా జిమ్‌ కోచ్‌ను వివరాలు అడిగి తెలుసుకోవడం మంచిది.)

ఇవి కూడా చదవండి:

Summer Skin Care: వేసవిలో చర్మ సంరక్షణకు కొబ్బరి నీరు ఉత్తమం..ఈ సమస్యలను దూరం చేస్తుంది

Headache: నిద్ర లేవగానే విపరీతమైన తలనొప్పి వస్తోందా ?.. ఎందుకు సంకేతమో తెలుసుకోండి..