టపాసులు కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలకు అవకాశం ఉండదు. ప్రతి దీపావళి ముందు ప్రభుత్వం, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నా ఇలాంటి ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. అయితే ఈసారి మాత్రం మార్కెట్లోకి కొన్ని సేఫ్టీ వస్తువులు వచ్చాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఈ కామర్స్ వెబ్సైట్లో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. బయట షాపుల్లో కూడా దొరికే ఈ చిన్న చిన్న వస్తువులను వాడితే దాదాపుగా టపాసుల ప్రమాదం నుంచి పిల్లల్ని కాపాడొచ్చు. మొదటిది సేఫ్టీ షీల్డ్… ఇది కరోనా టైంలో చాలామంది వాడిన ఫేస్ షీల్డ్.. ఇది టపాసులు కాల్చేటప్పుడు చిన్న పిల్లల ముఖానికి తగిలిస్తే టపాసుల స్పార్క్స్ తగలకుండా, ప్రమాదవశాత్తు చిచ్చుబుడ్లు పేలిన, ఎక్కడి నుంచో రాకెట్లు వచ్చి పడిన మొహానికి ఎలాంటి ప్రమాదం జరగదు.
ఇది సాధారణంగా షాపుల్లో కూడా అందుబాటులో ఉంది. చిన్నపిల్లలు చిచ్చుబుడ్లు, చిన్నచిన్న క్రాకర్స్ అనిపించేటప్పుడే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. సరిగ్గా అంటకపోవడం, దగ్గర నుంచి అంటించడం వల్ల వెంటనే పేలిపోవడం జరుగుతూ ఉంటాయి. ఈ లైటర్ వల్ల చాలా దూరం నుంచి క్రాకర్స్ ని అంటించొచ్చు. ఎలక్ట్రిక్ లైటర్ వల్ల క్రాకర్స్ కూడా వెంటనే అంటుకుంటాయి. దూరం నుంచి అంటించే అవకాశం ఉన్నందువల్ల ప్రమాదాలు చాలా మట్టుకు తగ్గిపోతాయి.
మరీ చిన్న పిల్లలైతే ఈ సేఫ్టీ గ్లాస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ గ్లాస్ తో పాటే చెవిలో పెట్టే సౌండ్ టు బర్డ్స్ కూడా అటాచ్డ్ గా వస్తాయి. పెద్ద పెద్ద శబ్దాలకు చిన్న పిల్లల కర్ణభేరి దెబ్బతినకుండా… కలలో ఎలాంటి స్పార్క్స్ పడకుండా కాపాడుతాయి. వీటితోపాటు చేతులకి గ్లౌస్, పొడవాటి అగరత్తులు ఇలా చాలానే మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. రెండు నుంచి మూడు వందల రూపాయల్లో ఆన్లైన్ మార్కెట్లో లభిస్తున్నాయి. ఇవి ఎందుకు కొనడం అనుకుంటే మీ ఇంట్లో ఉన్న హెల్మెట్ కూడా చిన్నపిల్లలకి పెట్టి సేఫ్టీ మైంటైన్ చేయొచ్చు.
ఇక వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. దీపావళి క్రాకర్స్ ఎక్కడైతే కాలుస్తున్నారో ఆ ప్రాంతంలో ఒక బకెట్ నీటిని అందుబాటులో ఉంచుకోవాలి. పిల్లలు కానీ పెద్దలు కానీ కాటన్ దుస్తులు వేసుకోకూడదు. ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచుకోవాలి. ఐదేళ్లలోపు పిల్లలను క్రాకర్స్కి దూరంగా ఉంచడం మంచిది. ఇక క్రాకర్స్‌ని సూచించిన పద్ధతిలోనే కాల్చాలి. వాటితో ప్రయోగాలు చేయకూడదు. ఎలక్ట్రిక్ పోల్స్, ఎలక్ట్రిక్ వైర్లు ఉన్న దగ్గర క్రాకర్స్ కాల్చరాదు. ఇక ఇండోర్స్ లో అస్సలు క్రాకర్స్ పేల్చరాదు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ పిల్లలు సేఫ్. దీపావళి పండుగ సంతోషకరంగానే కాకుండా సేఫ్ గా కూడా జరుపుకోవాలని టీవీ9 కోరుకుంటుంది.