Diabetic Problems: షుగర్ వ్యాధి ఉన్న ఆడవాళ్లకు ఇన్ ఫెక్షన్ సమస్యలు.. చికిత్స తీసుకోకపోతే ఇక అంతే..

| Edited By: Anil kumar poka

Dec 28, 2022 | 6:35 PM

రక్తంలో అధికంగా గ్లూకోజ్ లెవెల్స్ ఉంటే ముఖ్యంగా యోని ప్రాంతంలో ఈస్ట్ అధికంగా పెరుగుతుంది. ఇది అంత ప్రమాదకరం కాకపోయినా తగిన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. 

Diabetic Problems: షుగర్ వ్యాధి ఉన్న ఆడవాళ్లకు ఇన్ ఫెక్షన్ సమస్యలు.. చికిత్స తీసుకోకపోతే ఇక అంతే..
Diabetic Patients
Follow us on

మధుమేహం అంటే లింగ భేదంతో సంబంధం లేకుండా అందరూ ఎదుర్కొనే ఇబ్బంది. అయితే ఈ సమస్యతో బాధపడే ఆడవాళ్లు అనేక ఇన్ ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్ మెల్లిటస్ ఈస్ట్ ఇన్ ఫెక్షన్లతో పాటు ఇతర మహిళల్లో వివిధ అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని చెబుతున్నారు. రక్తంలో అధికంగా గ్లూకోజ్ లెవెల్స్ ఉంటే ముఖ్యంగా యోని ప్రాంతంలో ఈస్ట్ అధికంగా పెరుగుతుంది. ఇది అంత ప్రమాదకరం కాకపోయినా తగిన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. 

శరీరంలోని యోని ప్రాంతంలో ఈస్ట్ ఇన్ ఫెక్షన్ అనేది చాలా అరుదని నిపుణుల అభిప్రాయం. అయితే ఆ ప్రాంతంలో దురద, చికాకు అలాగే చుట్టుపక్కల నొప్పి, మూత్ర విసర్జన సమయంలో మంట, బాధాకరమైన లైంగిక సంపర్కం, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు, యోనిలో మార్పులు సంభవించినప్పుడు యోని ఈస్ట్ సమస్య వస్తుందని చెబుతున్నారు. ఈస్ట్ అనేది చక్కెర కారణంగా ఉత్పన్నమవుతుంది కాబట్టి అధిక చక్కెర సమస్యతో బాధపడే స్త్రీలు ఫంగల్ ఇన్ ఫెక్షన్ కు గురవుతారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే బ్యాక్టిరియా, ఈస్ట్ యోని సమతుల్యతను దెబ్బతిస్తాయి.

శరీరం అధిక చక్కెరను విడుదల చేయడానికి యోని ద్రవాలతో ఇతర ద్రవాలు ఉపయోగించుకుంటుంది. కొన్ని సందర్భాల్లో గర్భ నిరోధకాలు, యాంటీ బయోటిక్స్, అసురక్సిత లైంగిక కార్యకలాపాలు, తడిలేదా చాలా గట్టి లోదుస్తులు, హర్మోన్ల మార్పలు, మధుమేహ ఔషధాలు కూడా ఈస్ట్ ఇన్ ఫెక్షన్ కు కారణమవుతంది. ఎందుకంటే ఔషదాలు మూత్రనాళాన్ని ఉపయోగించి అధిక చక్కెరను బయటకు పంపుతాయి. సాధారణంగా ఈస్ట్ ఇన్ ఫెక్షన్ అనేది 14 రోజుల పాటు ఉంటుంది. యాంటీ ఫంగల్ మందులు,క్రీమ్ ల ద్వారా ఈ ఇన్ ఫెక్షన్ ఏడు రోజుల్లో తగ్గుతుంది. ఒక్కోసారి ఇన్ ఫెక్షన్ వేరే చోట్ల వచ్చి ఇబ్బందులకు గురి చేస్తోంది. 

ఇవి కూడా చదవండి

ఈస్ట్ ఇన్ ఫెక్షన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేయాలి.
  • తక్కువ కార్బోహైడ్రేట్లు, పెరుగు వంటి ప్రోబయోటిక్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిది.
  • హైడ్రేటెడ్ గా ఉంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
  • వైద్యుల సూచనల ప్రకారం మధుమేహం మందులు తీసుకోవాలి.
  • సౌకర్యవంతమైన లోదుస్తులను ధరించాలి. అలాగే యోని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
  • రెగ్యులర్ వ్యవధిలో శానిటరీ ప్యాడ్స్ మార్చుకోవాలి. 

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి