AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ లక్షణాలు డేంజర్.. న్యాచురల్ టిప్స్‌తో డయాబెటిస్‌కు చెక్ పెట్టొచ్చు.. ఎవ్వరికీ తెలియని రహస్యమిదే..

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, భారతదేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రతి ఏడుగురిలో ఒకరు డయాబెటిస్‌తో ప్రభావితమవుతున్నారు.. భవిష్యత్తులో ఈ సంఖ్య నాలుగుకు పెరిగే అవకాశం ఉంది. ఈ పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని, డయాబెటిస్‌పై పూర్తి అవగాహనతో ఉండటం చాలా మంచిది.

ఈ లక్షణాలు డేంజర్.. న్యాచురల్ టిప్స్‌తో డయాబెటిస్‌కు చెక్ పెట్టొచ్చు.. ఎవ్వరికీ తెలియని రహస్యమిదే..
Diabetes
Shaik Madar Saheb
|

Updated on: May 09, 2026 | 5:51 PM

Share

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 59 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. భారతదేశంలో ఈ సంఖ్య 9 కోట్లకు చేరింది. ప్రస్తుతం ప్రతి ఏడుగురిలో ఒకరు డయాబెటిస్‌తో ఇబ్బంది పడుతుండగా, భవిష్యత్తులో ఈ సంఖ్య ప్రతి ఏడుగురిలో నలుగురికి పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఈ తీవ్రతను పరిగణనలోకి తీసుకొని ప్రతి ఒక్కరికి మధుమేహంపై అవగాహన తప్పనిసరి.. మధుమేహ నివారణలో “ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్” అనే సూక్తి చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముందస్తు గుర్తింపు అనేది వ్యాధిని నివారించడంలో అత్యంత కీలకమైన అంశం. దీనికోసం, హై-రిస్క్ గ్రూపులలో ఉన్న వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ చరిత్ర, ఊబకాయం, అధిక రక్తపోటు, థైరాయిడ్ సమస్యలు వంటి అనుబంధ వ్యాధులు, నిద్రలేమి, మానసిక ఒత్తిళ్లు, సరైన జీవనశైలి లేకపోవడం వంటివి మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ లక్షణాలు ఉన్నవారు తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి..

డయాబెటిస్ (మధుమేహం) ప్రధాన లక్షణాలు:

తరచుగా మూత్ర విసర్జన, అధిక దాహం, అలసట, కారణం లేకుండా బరువు తగ్గడం, అస్పష్టమైన చూపు.. ఈ లక్షణాలు తరచుగా మెల్లగా మొదలవుతాయి, ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్‌లో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు ఇవి కనిపిస్తాయి.

చాలా మందికి పూర్తిస్థాయి మధుమేహం వచ్చేవరకు సమస్యను గుర్తించలేకపోవడం ఒక అపోహ. అయితే, ప్రీ-డయాబెటిస్ దశ కూడా అంతే ముఖ్యం. ఈ దశలోనే కొలెస్ట్రాల్ అధికమవడం, న్యూరలాజికల్ సమస్యలు, నరాల బలహీనత వంటి డయాబెటిక్ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి, ప్రీ-డయాబెటిస్‌ను కూడా వెంటనే గుర్తించి, అవసరమైతే చికిత్స తీసుకోవడం లేదా సరైన మందులు వాడటం చాలా అవసరం.

మధుమేహాన్ని సహజ పద్ధతులలో నివారించడానికి లేదా నియంత్రించడానికి జీవనశైలి మార్పులు ఎంతో సహాయపడతాయి:

ఆహార నియమాలు: అధిక చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. స్వీట్లను తగ్గించడం, పండ్ల విషయంలో కూడా వాటి క్యాలరీ కౌంట్‌ను గమనించుకోవడం ముఖ్యం. అన్నం వినియోగాన్ని పరిమితం చేయాలి, ఇడ్లీ, దోశ వంటివి కూడా ఎక్కువగా బియ్యంతో కూడి ఉంటాయి కాబట్టి వాటిని కూడా తగ్గించాలి. నాన్-వెజిటేరియన్ ఆహారం కంటే ఎక్కువ కూరగాయలు తినడం వల్ల పోషక విలువలు, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇది డయాబెటిస్ నియంత్రణకు ఉత్తమం.

నీరు తాగడం: రోజుకు 3-4 లీటర్ల నీరు త్రాగడం శరీరానికి, ముఖ్యంగా ఇన్సులిన్ పనితీరుకు చాలా అవసరం. తగినంత నీరు ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

వ్యాయామం: శారీరక శ్రమ మధుమేహ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. ధ్యానం, యోగా వంటివి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. అదే విధంగా, కండరాలను పెంపొందించే వ్యాయామాలు (మజిల్ డెవలపింగ్ ఎక్సర్సైజ్) చేయాలి. కండర ద్రవ్యరాశికి, ఇన్సులిన్ పనితీరుకు మధ్య సంబంధం ఉంది. కొవ్వు పదార్థం తగ్గితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. కండరాలను పెంచడం ద్వారా ఇన్సులిన్ పనితీరు మెరుగుపడి సహజంగా షుగర్ స్థాయిలు అదుపులోకి వస్తాయి.

ఒత్తిడి నిర్వహణ: మానసిక ఒత్తిడి (స్ట్రెస్) పెరిగితే స్ట్రెస్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి షుగర్ స్థాయిలను పెంచుతాయి. ఆకలిని పెంచుతాయి. వ్యాయామ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ధ్యానం, ప్రత్యామ్నాయ చికిత్సలు లేదా అవసరమైతే మందుల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యం.

నిద్ర: సరిపడా నిద్ర శరీరంలో హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడుతుంది. ఇన్సులిన్ కూడా ఒక హార్మోన్ కాబట్టి, మంచి నిద్ర దాని పనితీరును నియంత్రించి షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

ఈ విధంగా వివిధ కోణాల నుండి డయాబెటిస్‌ను పరీక్షించి, సహజ పద్ధతులను అనుసరించడం ద్వారా ముందస్తు నివారణ సాధించి, వ్యాధి సంబంధిత సమస్యలను నివారించవచ్చు.

ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సందేహాలున్నా.. సమస్యలున్నా నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
న్యాచురల్ టిప్స్‌తో డయాబెటిస్‌కు చెక్ పెట్టొచ్చు..
న్యాచురల్ టిప్స్‌తో డయాబెటిస్‌కు చెక్ పెట్టొచ్చు..
ఎండల తీవ్రతకు వాటర్ ట్యాంకులోని నీరు వేడెక్కుతున్నాయా?
ఎండల తీవ్రతకు వాటర్ ట్యాంకులోని నీరు వేడెక్కుతున్నాయా?
ఆ రోజు కెమెరామెన్‌ను లాగిపెట్టి కొట్టాడు :
ఆ రోజు కెమెరామెన్‌ను లాగిపెట్టి కొట్టాడు :
మీ వంటగది సింక్ మూసుకుపోయిందా? క్లియర్ చేసే సింపుల్ చిట్కాలు
మీ వంటగది సింక్ మూసుకుపోయిందా? క్లియర్ చేసే సింపుల్ చిట్కాలు
వంటిట్లో కొత్తిమీర తాజాగా ఉండాలా? ఈ చిట్కాలు పాటించండి
వంటిట్లో కొత్తిమీర తాజాగా ఉండాలా? ఈ చిట్కాలు పాటించండి
కార్బైడ్ లేని మామిడి పండ్లను ఇంట్లోనే ఇలా పండించండి..
కార్బైడ్ లేని మామిడి పండ్లను ఇంట్లోనే ఇలా పండించండి..
అమ్మకు ప్రేమతో... ఈ చిన్ని బహుమతులతో తన మనసును ఆనందపరచండి!
అమ్మకు ప్రేమతో... ఈ చిన్ని బహుమతులతో తన మనసును ఆనందపరచండి!
వారఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలకు చెక్
వారఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలకు చెక్
పాకిస్థాన్ జట్టులో రోహిత్, గిల్.. అసలు మ్యాటర్ తెలిస్తే నవ్వులే..
పాకిస్థాన్ జట్టులో రోహిత్, గిల్.. అసలు మ్యాటర్ తెలిస్తే నవ్వులే..
విజయ్‌లో నాకు నచ్చని లక్షణం అదే.. సీక్రెట్స్ బయటపెట్టిన త్రిష
విజయ్‌లో నాకు నచ్చని లక్షణం అదే.. సీక్రెట్స్ బయటపెట్టిన త్రిష