వర్షకాలంలో ఈ పండ్లను తినడం మానేయండి.. లేదంటే ఆరోగ్యానికి రిస్క్.. అవేంటంటే..

|

Jun 30, 2022 | 8:13 PM

ఇవి ఆరోగ్యానికి మేలు చేయడం కాదు.. అనారోగ్య సమస్యలను మరింత పెంచుతాయి. ముఖ్యంగా వర్షకాలంలో తినకూడని పదార్థాలు ఏంటో తెలుసుకుందామా.

వర్షకాలంలో ఈ పండ్లను తినడం మానేయండి.. లేదంటే ఆరోగ్యానికి రిస్క్.. అవేంటంటే..
Monsoon
Follow us on

వర్షకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించడం చాలా ముఖ్యం. ఈ సీజన్ లో పండ్లు, కూరగాయలు తొందరగా కుళ్లిపోతాయి. అంతేకాకుండా వర్షకాలంలో ఎక్కువ రోజులు ఉన్న పండ్లు, కూరగాయలను తీసుకోవడం వలన ఇన్పెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఆహారంలో బాక్టీరియా, క్రిములు పెరగడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా పుచ్చకాయ, మామిడి పండ్లకు దూరంగా ఉండాలి. అంతేకాదు ఈ సీజన్ లో ఆకు కూరలు కూడా తినకూడడు. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడం కాదు.. అనారోగ్య సమస్యలను మరింత పెంచుతాయి. ముఖ్యంగా వర్షకాలంలో తినకూడని పదార్థాలు ఏంటో తెలుసుకుందామా.

వర్షకాలంలో తినకూడని పండ్లు..
మామిడి పండ్లు..
వర్షకాలంలో ప్రారంభమైంది. ఈ సీజన్ ప్రారంభంలో మామిడి పండ్లను తినేస్తుంటారు. కానీ వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ సీజన్లో మామిడి పండ్లను తినకూడదు. ఇందులో ఫంగల్, బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది.

పుచ్చకాయ..
అత్యంత ఎక్కువ శాతం నీరు ఉండే పండు పుచ్చకాయ. కానీ వర్షకాలంలో మాత్రం దీనిని తినకూడదు. పుచ్చకాయ అనేక రకాల కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆకు కూరలు..
వర్షకాలంలో పచ్చి కూరగాయలను తినకపోవడమే మంచిది. ఈ కూరగాయలలో కీటకాలు, బ్యాక్టీరియా పెరుగుతాయి. కొన్నిసార్లు మురికి నీరు ఈ కూరగాయలను కలుషితం చేస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థలో సమస్యలను కలిగిస్తుంది.

Note: ఈ కథనం కేవలం నిపుణుల అభిప్రాయాలు, సూచనల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదు. సలహాల కోసం వైద్యులను సంప్రదించాలి.