రాజధానిపై ముందుకెలావెళ్లాలో ఆలోచిస్తాం : మంత్రి బొత్స

ఏపీ రాజధానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సుమారు 2 గంటల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి బొత్స, సీఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధాని నిర్మాణం కోసం మొత్తం 64 వేల మంది రైతులు తమ భూములు ఇచ్చారని , వీరిలో 43 వేల మంది రైతులకు రిజిష్ట్రేషన్ జరిగిందని తెలిపారు. మిగిలిన వారికి స్థలాల […]

రాజధానిపై  ముందుకెలావెళ్లాలో ఆలోచిస్తాం : మంత్రి బొత్స
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 29, 2019 | 8:54 PM

ఏపీ రాజధానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సుమారు 2 గంటల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి బొత్స, సీఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధాని నిర్మాణం కోసం మొత్తం 64 వేల మంది రైతులు తమ భూములు ఇచ్చారని , వీరిలో 43 వేల మంది రైతులకు రిజిష్ట్రేషన్ జరిగిందని తెలిపారు. మిగిలిన వారికి స్థలాల రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉందని తెలిపారు. రేపటినుంచి రైతులకు కౌలు బకాయిలు చెల్లించనున్నామని తెలిపారు. రాష్ట్ర రాజధారి అంటే 5 కోట్ల మంది ప్రజలదని, ఏ ఒక్క సామాజిక వర్గానిది కాదంటూ మంత్రి మరోసారి వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో రూ.35 వేల కోట్లతో టెండర్లు పిలిచారని, అన్నిపరిస్థితులు చూసుకుని ఆలోచించి ముందుకు వెళతామని బొత్స వెల్లడించారు. అన్ని వర్గాలవారి అభ్యున్నతి దిశగా ప్రభుత్వం ముందుకువెళుతుందని ఆయన చెప్పారు. అయితే రాజధాని అమరావతి విషయంలో ఎవరో ఏదో చెబితే తనకేమీ సంబంధం లేదని, ఇవాళ జరిగిన సమీక్షలో వాస్తవ పరిస్థితులపై సుధీర్ఘంగా చర్చించినట్టు ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే రాజధాని విషయంలో మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి.

Latest Articles