ఈ యాప్స్ మీ మొబైల‌్‌లో ఉన్నాయా.. అయితే రిస్కే

స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడలేని ఎంక్వరీలు మొదలయ్యాయి. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు అర్ధం లేకుండా పోయింది. ఎవరి ఫోన్‌లో ఏ యాప్ ఉందో అది ఎందుకు ఉపయోగిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. ముఖ్యంగా కొన్ని స్పై యాప్స్‌తో భర్తా భర్తలు నిఘా పెట్టుకుని కొంపలు కొల్లేరు చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు అధికమవుతూనే ఉంది. అలాగే లవర్స్ అయితే ఇక చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా తమ పిల్లలు స్కూల్‌లో ఈ ఫోన్స్ వాడుతూ ఏం చేస్తున్నారో కూడా కొన్నియాప్స్ సహాయంతో కనిపెట్టే వీలుంది. దీంతో వారి యాక్టివిటీస్ తెలుసుకోగల్గుతున్నారు. అయితే ఇలాంటి స్పై యాప్స్‌ విషయంలో గూగూల్ సీరియస్‌గా తీసుకుంది.

ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఇలాంటి పలు యాప్‌లను గుర్తించిన గూగుల్ వాటిని తొలగించింది. వ్యక్తుల ప్రైవసీకి ముప్పుగా ఈ యాప్స్ మారడంతో ఈ నిర్ణయం తీసుకుంది. టెక్నాలజీ ఆధారంగా స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన ఈ యాప్‌లు తమ ఫోన్‌లో ఉన్న సంగతిని కూడా బాధితులు తెలుసుకోలేరని గూగుల్ పేర్కొంది. నిషేధించబడ్డ యాప్‌లలో ..ట్రాక్‌ ఎంప్లాయీస్‌ చెక్‌ వర్క్‌ ఫోన్‌ ఆన్‌లైన్‌ స్పై ఫ్రీ , స్పై కిడ్స్‌ ట్రాకర్‌, ఫోన్‌ సెల్‌ ట్రాకర్, మొబైల్‌ ట్రాకింగ్‌ , స్పై ట్రాకర్‌, ఎస్‌ఎంఎస్‌ ట్రాకర్‌, ‘ఎంప్లాయీ వర్క్‌ స్పై యాప్స్ ఉన్నాయి. ఇటువంటి యాప్స్ ఉపయోగించడం ద్వారా ఎదుటివారి జీవితాల్లోకి తొంగిచూసినట్టే అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *