విహార యాత్ర మిగిల్చిన విషాదం వెనుక..”ఆమె కథ’

పాపికొండలు విహార యాత్ర మిగిల్చిన విషాద గాధలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో ఇంటిది ఒక్కో కన్నీటి కథ..దాదాపు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రయాణికుల జీవితాల్లో పెను చీకట్లను మిగిల్చింది బోటు ప్రమాదం. తల్లిదండ్రులను పొగొట్టుకున్న బిడ్డలు, బిడ్డల్ని కొల్పోయిన తల్లిదండ్రులు ఇలా ఒక్కోక్కరిది ఒక్కో కన్నీటి కథ. అలాంటి కథే..పశ్చిమగోదావరి జిల్లాకు శశి కన్నీటి గాధ. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన శశి, చట్లపల్లి గంగాధర్‌.. ఆరేళ్ల క్రితం […]

విహార యాత్ర మిగిల్చిన విషాదం వెనుక..ఆమె కథ'
Follow us

|

Updated on: Sep 19, 2019 | 3:50 PM

పాపికొండలు విహార యాత్ర మిగిల్చిన విషాద గాధలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో ఇంటిది ఒక్కో కన్నీటి కథ..దాదాపు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రయాణికుల జీవితాల్లో పెను చీకట్లను మిగిల్చింది బోటు ప్రమాదం. తల్లిదండ్రులను పొగొట్టుకున్న బిడ్డలు, బిడ్డల్ని కొల్పోయిన తల్లిదండ్రులు ఇలా ఒక్కోక్కరిది ఒక్కో కన్నీటి కథ. అలాంటి కథే..పశ్చిమగోదావరి జిల్లాకు శశి కన్నీటి గాధ.

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన శశి, చట్లపల్లి గంగాధర్‌.. ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గంగాధర్‌ హైవే కంపెనీలో చిన్న కాంట్రాక్ట్‌ పనులు చేస్తుండగా, శశి ద్వారకాతిరుమల బాలయోగి గురుకుల పాఠశాలలో ప్రవేట్‌ టీచర్‌గా పని చేస్తుంది. వీరికి 14 నెలల బాబు (శ్రవణ్‌) ఉన్నాడు. అయితే, ఇద్దరూ ఉద్యోగ రీత్యా ఇద్దరూ వేరువేరుగా ఉంటూ..ప్రతీ శనివారం భార్య బిడ్డలను చూసేందుకు ద్వారకా తిరుమల వచ్చేవాడు గంగాధర్‌. ఈ క్రమంలోనే సెప్టెంబర్‌ 14న భార్య బిడ్డలను చూసేందుకు వచ్చిన గంగాధర్‌..మర్నాడు గోదావరి టూర్‌కు బయల్దేరాడు. భార్య వద్దని ఎంతగానో వారించింది..వారానికి ఒక్కరోజే ఇంటివద్ద ఉంటారు..అది కూడా ఇలా మీరు టూర్‌కి వెళ్లటం నాకు ఇష్టం లేదని ఆమె అడ్డుపడిందట. అయినా అతను వినలేదు..స్నేహితులతో కలిసి సరదాగా వెళ్లి..సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తానని నచ్చజెప్పాడు. శ్రవణ్‌ జాగ్రత్త.. అంటూ బయల్దేరాడు.
రాజమండ్రి వెళ్లి బోటు ఎక్కిన తర్వాత భార్యతో కొద్దిసేపు ఫోన్‌లో మాట్లాడాడు. ఇప్పుడే బోట్‌ ఎక్కాము..శ్రవణ్‌ జాగ్రత్త అంటూ చెప్పాడు. అదే భర్త చెప్పిన చివరి మాటలని అప్పుడు ఆమె గ్రహించలేకపోయింది. మధ్యాహ్ననికి బోటు గోదావరిలో మునిగిపోయిందనే వార్త చూసి శశి కుప్పకూలింది. భర్త కోసం వెంటనే ఫోన్‌లో ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. రోజులు గడుస్తున్నా..గంగాధర్‌ ఆచూకీ లభ్యంకాకపోవడంతో ఆ భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తన భర్త క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ తన చంటి బిడ్డతో కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తోంది.

ఇదిలా ఉంటే, శశి, గంగాధర్‌ల ప్రేమ వివాహన్ని ఇంతకాలంగా గంగాధర్‌ కుటుంబ సభ్యులు అంగీకరించలేదట. తన భర్త బోటు ప్రమాదంలో గల్లంతైనా..వారి కుటుంబ సభ్యులు తనను, తన బిడ్డను గుర్తించటం లేదని శశి విలపిస్తోంది. పైగా తానేవరో కూడా వారికి తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, తనను, తన బిడ్డను ఆదరించాలని వేడుకుంటోంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు