ధోనీకి జట్టు యాజమాన్యంతో అలాంటి బంధం ఉంది…: గంభీర్

ఆ జట్టు సారథి ధోనీపై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఆసక్తికర కామెంట్ చేశారు. ఈ సారి ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌కు దూరమైనా... వచ్చే ఏడాది కూడా ఎంఎస్‌ ధోనినే జట్టు కెప్టెన్‌గా కొనసాగవచ్చని జోష్యం చెప్పారు...

ధోనీకి జట్టు యాజమాన్యంతో అలాంటి బంధం ఉంది...: గంభీర్
Follow us

|

Updated on: Oct 30, 2020 | 10:09 AM

Gambhir Comments on Dhoni : చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ ఏడాది కలిసి రాలేదు. ఐపీఎల్ -13 సీజన్‌ను ఓటములతో ధోనీ సేన  ప్రారంభించింది. అయితే ఆడిన ఐదు మ్యాచుల్లో మూడింటిలో ఓటమిని మూటగట్టుకుని..పాయిట్ల పట్టికలో చివరికి చేరింది. ఇదిలావుంటే ఆ జట్టు సారథి ధోనీపై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఆసక్తికర కామెంట్ చేశారు. ఈ సారి ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌కు దూరమైనా… వచ్చే ఏడాది కూడా ఎంఎస్‌ ధోనినే జట్టు కెప్టెన్‌గా కొనసాగవచ్చని జోష్యం చెప్పారు.

కెప్టెన్ ధోనికి, టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం అలాంటిది అంటూ వ్యాఖ్యానించాడు. రెండు వైపులనుంచి పరస్పర గౌరవం ఉంటేనే ఇది సాధ్యమవుతుందని గంభీర్‌ అభిప్రాయ పడ్డారు. ఐపీఎల్‌ ప్రారంభమైన నాటినుంచి చెన్నై మేనేజ్‌మెంట్‌ ధోనికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది… దానికి తగినట్లుగానే అతను అద్భుత ఫలితాలు సాధించి చూపించాడని చెప్పుకొచ్చారు. జట్టు కోసం ఎంతో చేశాడని తెలిపారు.

కాబట్టి మరోసారి ధోనిని చెన్నై కెప్టెన్‌గా కొనసాగించడంలో ఆశ్చర్యం లేదు అంటూ వ్యాఖ్యానించారు. అతనికి మేనేజ్‌మెంట్‌పై, వారికి ధోనిపై ఉన్న పరస్పర గౌరవం, అనుబంధమే అందుకు కారణం. ఆటలో భావోద్వేగాలకు చోటు లేదు అనే మాటలు చెప్పడం సులువే కానీ ఆ దగ్గరితనాన్ని ఎవరూ కాదనలేరు. కాబట్టి 2021లో ప్రస్తుత జట్టులో చాలా మార్పులు జరిగినా కెప్టెన్‌గా మాత్రం ధోనినే ఉంటాడని నేను నమ్ముతున్నాను అంటూ గంభీర్‌ విశ్లేషించారు.

టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు