గాల్వన్ లోయకు చైనీస్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్లు ?

గాల్వన్ లోయలో భారత, చైనా దళాల ఘర్షణ తరువాత లదాఖ్ లో శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూసేందుకు రెండు దేశాలూ దౌత్య స్థాయిలో చర్చలు జరుపుతున్నప్పటికీ.. చైనా మాత్రం మన భూభాగం పై కన్నేసినట్టే ఉంది. టిబెట్ ప్రాంతంలో..

గాల్వన్ లోయకు చైనీస్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్లు ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 28, 2020 | 2:20 PM

గాల్వన్ లోయలో భారత, చైనా దళాల ఘర్షణ తరువాత లదాఖ్ లో శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూసేందుకు రెండు దేశాలూ దౌత్య స్థాయిలో చర్చలు జరుపుతున్నప్పటికీ.. చైనా మాత్రం మన భూభాగం పై కన్నేసినట్టే ఉంది. టిబెట్ ప్రాంతంలో తమ సైనిక దళాలకు శిక్షణ ఇచ్చేందుకు చైనా 20 మంది మార్షల్ ఆర్ట్స్ ట్రెయినర్లను పంపుతున్నట్టు తెలిసింది. అయితే అధికారికంగా ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న విషయం వెల్లడి కాలేదు. గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణే ఇందుకు కారణమని భావిస్తున్నారు. 1996 లో ఉభయ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాల సైనికుల్లో ఎవరూ తమ వెంట ఆయుధాలు గానీ, పేలుడు పదార్థాలు గానీ తీసుకువెళ్లరాదన్నదే. కాగా సైనిక దళాలకు శిక్షణ ఇచ్చేందుకు చైనీస్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్లను పంపాలని వార్తలు వచ్చాయని హాంకాంగ్ మీడియా పేర్కొంది. ‘ఎన్బో ఫైట్ క్లబ్’ కి చెందిన ఇరవై మంది ఫైటర్లు టిబెట్ రాజధాని లాసాకు చేరుకుంటారన్నది ఈ వార్తల సారాంశం,. అయితే ఈ ఫైటర్లు ఇండియాతో గల బోర్డర్ లో ట్రైనింగ్ ట్రూప్స్ వెంబడి ఉంటారా.. వారికి ఎంతకాలం శిక్షణ ఇస్తారు వంటి అంశాలేవీ తెలియదు.