కరోనాకు విరుగుడు వ్యాక్సీన్.. ఆరు నెలల్లో హ్యూమన్ ట్రయల్స్.. పూణేలో మొదలైన రీసెర్చ్

చైనాలో మొదలై ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా (కోవిడ్-19) వైరస్ కు విరుగుడు వ్యాక్సీన్ ను కనుగొనేందుకు  పూణేలోని రీసెర్చర్లు నడుం కట్టారు. అక్కడి సీరమ్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ ఇండియా, అమెరికన్ బయోటెక్నాలజీ సంస్థ..’కోడాజెనిక్స్’ రెండూ కలిసి దీన్ని తయారు చేసేందుకు కృషి మొదలుపెట్టాయి. ప్రస్తుతం ప్రీ-క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న ఈ టీకాను ఆరునెలల్లోగా ప్రయోగాత్మకంగా మానవులపై కూడా పరీక్షించే అవకాశాలున్నాయని ఈ సంస్థల పరిశోధకులు చెబుతున్నారు. ఈ సంస్థలు ల్యాబ్ లో […]

కరోనాకు విరుగుడు వ్యాక్సీన్.. ఆరు నెలల్లో హ్యూమన్ ట్రయల్స్.. పూణేలో మొదలైన రీసెర్చ్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 18, 2020 | 1:59 PM

చైనాలో మొదలై ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా (కోవిడ్-19) వైరస్ కు విరుగుడు వ్యాక్సీన్ ను కనుగొనేందుకు  పూణేలోని రీసెర్చర్లు నడుం కట్టారు. అక్కడి సీరమ్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ ఇండియా, అమెరికన్ బయోటెక్నాలజీ సంస్థ..’కోడాజెనిక్స్’ రెండూ కలిసి దీన్ని తయారు చేసేందుకు కృషి మొదలుపెట్టాయి. ప్రస్తుతం ప్రీ-క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న ఈ టీకాను ఆరునెలల్లోగా ప్రయోగాత్మకంగా మానవులపై కూడా పరీక్షించే అవకాశాలున్నాయని ఈ సంస్థల పరిశోధకులు చెబుతున్నారు. ఈ సంస్థలు ల్యాబ్ లో తయారైన సింథటిక్ వైరస్ ను ఉపయోగించి

‘కోడాజెనిక్స్ క్యాండిడేట్ వ్యాక్సీన్’ పేరిట దీని తయారీకి పూనుకొన్నారు.  ఇది కరోనా వైరస్ ను నివారించే ‘కవచం’ (షీల్డ్) తయారీకి పట్టే సమయాన్ని తగ్గిస్తుందని ప్రముఖ పారిశ్రామికవేత్త, సీరమ్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ ఐడియా సీఈవో ఆదర్ పూనావాలా తెలిపారు. ఆరు నెలల్లో హ్యూమన్ ట్రయల్స్ మొదలవుతాయని, ఇది ‘ఫాస్టెస్ట్ మేడిన్ ఇండియా వ్యాక్సీన్ ‘ అవుతుందని ఆయన చెప్పారు. అయితే మొదట దీనికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి రావలసి ఉందన్నారు. పూర్తి స్థాయి ట్రయల్స్ కు ఏడాది పట్టవచ్ఛునని భావిస్తున్నామని, అలాగే దేశవ్యాప్త ప్రయోగం 2022 లో మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. అటు-గంగాఖేద్కర్ అనే  శాస్త్రవేత్త మాట్లాడుతూ.. ఆగస్టు మాసాంతానికి ఎలుకలు, చుంచెలుకలపై ప్రయోగాత్మక పరీక్షలు జరుపుతామని తెలిపారు. ఏమైనా.. ఈ ప్రాజెక్టుకు రూ. 250 కోట్ల నుంచి 300 కోట్లు ఖర్చు కావచ్ఛునని ఆయన పేర్కొన్నారు.

Latest Articles