భారత సేనలంటే ‘భయం’ ? ఏడుస్తున్న చైనా సైనికులు !

ఇండియాతో గల సరిహద్దు ప్రాంతాలకు తమను పంపుతున్నందుకు చైనా సైనికులు కొందరు ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లడాఖ్ వాస్తవాధీన రేఖ వద్దకు తమను పంపడం పట్ల వారు అసంతృప్తిగా ఉన్నారని..

భారత సేనలంటే 'భయం' ? ఏడుస్తున్న చైనా సైనికులు !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 23, 2020 | 7:40 PM

ఇండియాతో గల సరిహద్దు ప్రాంతాలకు తమను పంపుతున్నందుకు చైనా సైనికులు కొందరు ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లడాఖ్ వాస్తవాధీన రేఖ వద్దకు తమను పంపడం పట్ల వారు అసంతృప్తిగా ఉన్నారని, భారత దళాల చేతిలో తమకు చావు తప్పదని భయపడి వీరు ఏడుస్తున్నట్టు ఉందని అంటున్నారు. వీళ్ళలో కొంతమంది ఇంకా కుర్ర వయస్సులోనే ఉన్నారు. కొత్తగా రిక్రూట్ అయిన సుమారు 10 మంది చైనాలోని అన్ హూ ప్రావిన్స్ కి చెందినవారు. వీళ్ళలో కొందరు కాలేజీ స్టూడెంట్స్ కూడా ఉన్నారని, టిబెట్ లో సేనలకు సహకరించేందుకుకొంతమంది స్వఛ్చందంగా సైన్యంలో చేరారని తెలుస్తోంది. అయితే వీరిది భయం కాదని, తమ కుటుంబాలను వీడి వెళ్తున్నందుకు బాధతో విలపిస్తున్నారని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. భారత సేనల చేతిలో తమకు మరణం తప్పదేమోనని ఈ కుర్ర సైనికులు ఏడుస్తున్నారన్న తైవాన్ కథనాన్ని ఈ పత్రిక ఖండించింది.