
దర్శకుడు మణిరత్నం తెరకెక్కి్స్తోన్న సరికొత్త ప్రేమకథా చిత్రం “ఇంజి వెల్లం”. ఈ సినిమా అనౌన్స్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ మూవీ విడుదల తేదీ ఖరారైంది. విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న ఈ సినిమా 2027 జనవరి 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మణిరత్నం సొంత సంస్థ మద్రాస్ టాకీస్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. విజయ్ సేతుపతి, సాయి పల్లవితో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్న కొత్త పోస్టర్‌ను కూడా చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను సెప్టెంబర్ 7న ప్రకటించారు. ఆ పోస్టర్లో విజయ్ సేతుపతి, సాయి పల్లవి వర్షంలో ఆత్మీయంగా కనిపించారు. దీంతో ఇది ప్రేమకథ అని స్పష్టమైంది. అయితే వారి పాత్రలేమిటి, కథేమిటనే వివరాలను చిత్రబృందం ఇప్పటికీ బయటపెట్టలేదు. కోల్‌కతా ఈ సినిమా ప్రధాన షూటింగ్ ప్రదేశాల్లో ఒకటని సమాచారం.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..
“థగ్ లైఫ్” తర్వాత మణిరత్నం తీస్తున్న సినిమా ఇది. ఆయన ఈసారి మళ్లీ ప్రేమకథతో వస్తుండడంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొంది. విజయ్ సేతుపతి మణిరత్నంతో 2018లో వచ్చిన “చెక్క చివంత వానం” తర్వాత మళ్లీ కలిసి పనిచేస్తున్నారు. సాయి పల్లవి, విజయ్ సేతుపతి కలిసి నటించడం ఇదే మొదటిసారి కావడంతో ఈ జోడీపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..
ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మణిరత్నం, రెహమాన్ కలయికలో ఇది మరో సినిమా. కన్నడ నటి చైత్ర జె ఆచార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాటోగ్రఫీని అవిక్ ముఖోపాధ్యాయ్, ఎడిటింగ్‌ను శ్రీకర్ ప్రసాద్ నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా శర్మిష్ఠ రాయ్, కొరియోగ్రాఫర్‌గా బృంద గోపాల్, స్టంట్ కొరియోగ్రాఫర్‌గా దిలీప్ సుబ్బరాయన్ పనిచేస్తున్నారు. “సుభాస్కరన్ ప్రెజెంట్స్”గా వస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతి డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “స్లమ్ డాగ్” చిత్రలో నటిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..