టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటించిన డియర్ కామ్రేడ్. కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక రెండోసారి జత కట్టింది. ఒక కామ్రేడ్ పోరాడితే అతనికి ఆ పోరాటం హాయిని ఇవ్వాలి. స్వేచ్ఛను ఇవ్వాలి నిన్ను చూస్తే అలా లేవు అనే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్.. ఆధ్యంతం అదరగొడుతోంది. ఇక ట్రైలర్‌కు జస్టిన్ ప్రభాకరణ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మెయిన్ అస్సెట్‌గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, సాంగ్స్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.